వివాదాలకు రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ బాబు ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న హైదరాబాద్ కూకట్ పల్లి లోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు మహేష్ వచ్చాడు. మహేష్ వస్తున్నాడు అని తెలియగానే వేలాది సంఖ్యలో అభిమానులు అక్కడ గుమిగూడారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ హడావిడిలో చిక్కుకున్న ఒక మహిళకు గాయాలు అయినా అటు మహేష్ అభిమానులు కానీ ఇటు మహేష్ కానీ ఏమి పట్టించుకోనట్లు ప్రవర్తించడం మీడియా వర్గాలకు అసహనాన్ని కలిగించింది. 

వ్యాపారసంస్థల ప్రారంభోత్సవానికి ప్రమోషన్ కు కోట్లాది రూపాయలు తీసుకునే టాప్ హీరోలకు కనీసం ఒక మహిళ పడేకష్టాలు కూడ తెలియవా అంటూ కొన్ని మీడియా సంస్థలు మహేష్ కు చురకులు అంటిస్తున్నాయి. ఈషాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో కనిపించిన మహేష్ లుక్ ను చూసి అతడి అభిమానులు కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా కోసం పెంచిన తన గడ్డం లుక్ కాకుండా ఆగడ్డం లేకుండా మహేష్ తన మామూలు లుక్ తో కనిపించడంతో మహేష్ గడ్డం లుక్ ఏమైంది అంటూ మహేష్ అభిమానులు ఆశ్చర్యపోయారు. 
Mahesh Babu's new makeover
ఈసినిమాకు సంబంధించి జుట్టు గడ్డం కూడా బాగా పెంచి ఉత్తరాఖండ్‌ లో నాలుగు వారాలపాటు విపరీతమైన వర్షాలను కూడ లెక్క చేయకుండా ఈసినిమా షూటింగ్ పూర్తి చేసి ఈమధ్యనే మహేష్ హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. దీనికితోడు ఈమధ్య మహేష్ నటించిన ప్రకటనల్లో కూడా గడ్డంతోనే కనిపించాడు. దీనితో మహేష్ లుక్ ఇలాగే చాలకాలం ఉంటుందని అభిమానులు అనుకున్నారు. 

అయితే ఇప్పుడు హటాత్ గా మహేష్ తన గడ్డం తీసి కనిపించడంతో ఇక సినిమా అంతే ఇదే లుక్‌లో మహేష్ కనిపిస్తాడేమో అని అంతా అనుకున్నారు. మళ్లీ పెంచుతాడా లేక ఈసినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్లో క్లీన్ షేవ్‌ తోనే కనిపిస్తాడాఅంటూ చెన్నై సిల్క్ ఓపెనింగ్ లో మహేష్ ను చూసిన అభిమానులు మాట్లాడుకుంటూ ఈ హడావిడి మధ్య ఒక మహిళ రోదన చేస్తున్నా పట్టించుకోలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: