తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ మొదటి వారం పెద్దగా ఆసక్తి లేకపోయినా..రెండు, మూడు వారాల్లో కాస్త ఆకస్తి రేపుతుంది.  అయితే హౌజ్ లో కంటెస్టంట్ల మద్య కొన్ని ఆసక్తికరమైన క్రీడలు, టాస్క్ లు పెడుతున్నారు బిగ్ బాస్. దాంతో ఒకరికి తెలియకుండా ఒకరు సీక్రెట్ టాస్క్ లు చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటి వరకు సామాన్యులుగా వచ్చిన సంజన, నూతన్ నాయుడు లతో పాటు కిరీటి, యాంకర్ శ్యామల, భాను ఎలిమినేట్ అయ్యారు.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో టీమ్ సభ్యుల మద్య పోటా పోటీ గా వ్యవహారం ఆసక్తికరంగా నడుస్తుంది. 
Image result for big boss 2 telugu
తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో సామాన్యుడిగా వచ్చిన గణేష్ వెక్కి వెక్కి ఏడ్చాడు.  దాంతో హౌజ్ సభ్యులు అందరూ ఆశ్చర్యపోయారు.  అసలు తాను బిగ్ బాస్ లో ఉండనని..తాను బిగ్ బాస్ లో తన్నులు తినడానికి రాలేదని నన్ను ఎలిమినేట్ చేయమని కోరాడు గణేష్.  అయితే గణేష్ అంతగా బాధపడటానికి కారణం ఎవరో తెలుసా..అమిత్.    నిన్న వారం ప్రారంభ ఎపిసోడ్ కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
Image result for big boss 2 telugu
అందరూ కలసి చర్చించుకోగా, అమిత్ పేరును చెప్పారు. దీంతో అమిత్ ను ఎలిమినేషన్ కు డైరెక్టుగా నామినేట్ చేసిన బిగ్ బాస్, సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ చేస్తే గట్టెక్కవచ్చని చెప్పాడు.  అమిత్ కు ఐదు టాస్క్ లను ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా పూర్తి చేయాలని ఆదేశించాడు. అందులో ఒకటి... ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డుతో కొట్టాలి. దాంతో అమిత్ వెళ్లి గణేష్, దీప్తి కలిసుండగా అకస్మాత్తుగా గణేష్ నెత్తిపై గుడ్డు కొట్టాడు.  దాంతో ఏం జరుగుతుందో తెలియక గణేష్ షాక్ తిన్నాడు. 

ఆ సమయంలో గణేష్ ని చూసి అమిత్ సీరియస్ గా ఎలిమినేషన్లో నా వైపు వేలెత్తి చూపిస్తావా..నా సంగతి తెయదు..నా కోపం చూడవద్దని చెప్పాను. కానీ చూశావు" అంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన గణేష్, అది సీక్రెట్ టాస్క్ అయ్యుండవచ్చని దీప్తి చెబుతున్నా వినకుండా చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. బాత్ రూముకు వెళ్లి గట్టిగా ఏడ్చి ఆపై కెమెరాల ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: