‘డర్టీ పిక్చర్’ ఘన విజయంతో బాలీవుడ్ మీడియా ఆమెకు బయోపిక్ బ్యూటీ అన్న పేరు పెట్టింది. ఈమూవీ తరువాత అనేక బయోపిక్ సినిమాలలో విద్యాబాలన్ కు ఆఫర్స్ వచ్చినా ఆమె ఏ బయోపిక్ ను ఒప్పుకోకుండా తన నటనకు సంబంధించి మొనాటనీ రాకుండా జాగ్రత్త పడింది.
Vidya Balan
ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో విద్యాబాలన్ ను ‘బసవతారకం’ పాత్రలో ఒప్పించడానికి బాలకృష్ణ చాల కష్టపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బయోపిక్ లో నటించడానికి 2 కోట్ల భారీ పారితోషికం ఆమె డిమాండ్ చేయడమే కాకుండా బసవతారకం పాత్రను కేవలం మిసెస్ బసవతారకం రామారావుగా కాకుండా ఆమె పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటేనే తాను నటిస్తాను అని విద్యాబాలన్ చెప్పడంతో ఎన్టీఆర్ జీవితంలో బసవతారకం ప్రభావాన్ని హైలెట్ చేసే విధంగా విద్యాబాలన్ పాత్రను క్రిష్ డిజైన్ చేసినట్లు సమాచారం. 
 Vidya Balan, Vidya Balan fat, Vidya Balan Weight, Vidya Balan fat Belly, Fat Vidya Balan, Vidya Balan recent news, Vidya Balan latest News, Bollywood news, Entertainment news
తెలుస్తున్న సమాచారం మేరకు విద్యాబాలన్ గత రెండురోజులుగా ఎన్టీఆర్ కూతుళ్ళను అదేవిధంగా ఆయన కోడళ్ళను వ్యక్తిగతంగా కలవడమే కాకుండా బసవరామ తారకం గురించి వారికి తెలిసిన సంగతులు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆమె జీవన శైలిలో ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ ఏమైనా వున్నాయా ? ఎలా నడిచేవారు ? ఎలా కూర్చునేవారు ? ఆమె అభిరుచులు ఏమిటి ఇలా ప్రతీ విషయాన్ని గుచ్చిగుచ్చి అడుగుతున్నట్లు టాక్. 
krish to direct telugu flick before gabbar
ముఖ్యంగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ ఏమీ తెలియని నేపద్యంలో కేవలం క్రిష్ చెప్పిన ఇన్ పుట్స్ పై ఆధారపడి నటించకుండా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ పరకాయ ప్రవేశం చేయడానికి ఇలా విద్యాబాలన్ నందమూరి కుటుంబ సభ్యులను తన అబ్జర్వేషన్ లో పెట్టినట్లు అనుకోవాలి. ముఖ్యంగా బసవతారకంకు ఉన్న సంగీత అభిరుచి గురించి కూడ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వివరించినట్లు సమాచారం. ప్రతి చిన్న విషయంలోనూ క్రిష్ తీసుకుంటున్న జాగ్రత్తలతో ఎన్టీఆర్ బయోపిక్ ఒక చరిత్ర సృష్టిస్తుందని నందమూరి అభిమానులే కాకుండా నందమూరి కుటుంబం కూడ భావిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: