తెలుగు ఇండస్ట్రీలో టెంపర్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి.  జై లవకుశ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం త్వరగా పూర్తి చేసుకొని దసర పండుగ రేస్ లో నిలవబోతుంది. 
Image result for ntr aravinda sametha new stills
కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట.  ప్రస్తుతం  ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో ముఖ్యమైన కాలేజ్‌ నేపథ్యంలో జరిగే సన్నివేశాలు చిత్రీకరించడానికి చిత్రబృందం నిన్నటినుండి షూట్ మొదలు పెట్టింది.
Related image
ఇక కాలేజ్ స్టూడెంట్ గా ఎన్టీఆర్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు..కాలేజ్ లో పూజా హెగ్డె, ఎన్టీఆర్ మద్య వచ్చే సన్నివేశాలు రొమాంటిక్, కామెడీ గా ఉండబోతున్నాయని సమాచారం. ఐతే కాలేజీ నేపథ్యంలో జరిగే ఈ షెడ్యూల్‌ ఆగష్టు 3వ తేదీ వరకు జరగనుంది. ఆ తర్వాత పొల్లాచ్చిలో పాటల చిత్రీకరణ జరుపుతారు.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: