బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది. రాజమౌళి సినిమా కాబట్టి ఈ సినిమా కథ ఇదంటూ రోజుకో కథ చెక్కర్లు కొడుతుంది.


కొన్నాళ్లుగా ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ అని.. ఎన్.టి.ఆర్, చరణ్ అన్నదమ్ములుగా నటిస్తారని. అందులో ఎన్.టి.ఆర్ గ్యాంగ్ స్టర్, చరణ్ పోలీస్ గా కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ గురించి కొత్త కథ వినిపిస్తుంది.


ఇదో పిరియాడికల్ మూవీ అని అంటున్నారు. అంటే 80, 90ల కాలం నాటి కథ కాదు ఏకంగా స్వాతంత్రం రాక ముందు వచ్చిన తర్వాత బ్రిటీష్ కాలం నాటి కథతో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు సంబందించి సెట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయట. రాజమౌళి సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. 


అందులో భాగంగా ఈ సినిమాకు సంబందించి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలు పెట్టారట. ముందు తెలుగు, తమిళ భాషల్లో 150 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేద్దామనుకున్న ఈ సినిమా హిందిలో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అవడంతో బడ్జెట్ కూడా 300 కోట్లు పెట్టేస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: