జూనియర్ బాలయ్యల మధ్య గ్యాప్ పెరిగి పోవడంతో వీరిద్దరినీ ఏదైనా సంఘటన కలిపితే బాగుటుంది అని అనుకుంటూ నందమూరి అభిమానులు ఎప్పటినుంచో కలలు కంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ జూనియర్ బాలయ్యల మధ్య దూరం  తగ్గిస్తుందని భావించినా ఆ ఆశ నెరవేరలేదు. ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరినీ కలిపిన ఘనత రామోజీ ఫిలిం సిటీకి దక్కింది. 
Actor called up his uncle after returning from Spain and apparently apologised for their differences.
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాబాయి-అబ్బాయి’ సినిమాల షూటింగ్ జోరుగా ఇంచుముంచు చాలా దగ్గరలో జరగడం నందమూరి అభిమానులకు జోష్ ను ఇస్తోంది.  ఒక వైపు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘అరవింద సమేత’ మరోవైపు బాబాయి బాలకృష్ణ సినిమా ‘ఎన్టీఆర్ బయోపిక్ ’ల షూటింగులతో రామోజీ ఫిలిం సిటీలో నందమూరి హవా కొనసాగుతోంది. త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీక రిస్తున్నారు.   

కాలేజీ సెట్ వేసి ఎన్టీఆర్ హీరోయిన్ పూజా హెగ్డే లపై సోమవారం కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఈ 15 రోజుల షెడ్యూల్ అనంతరం పొలాచ్చికి యూనిట్ తరలివెళ్ళనుంది రాయలసీమ నేపథ్యంలో సాగే ఈమూవీలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్‌ లో కనిపించనున్న నేపధ్యం తెలిసిందే. ఆగష్టు 15న విడుదల కాబడే ఈమూవీ టీజర్‌ గురించి జూనియర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
Balakrishna-as-NTR-NTR-biopic-launch
బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కూడా ఇదే రామోజీ ఫిల్మ్ సిటీలో మరోచోట జరుగుతోంది. ఈరోజు నుంచి విద్యాబాలన్ ఈమూవీ షూటింగ్ లో పాల్గొనబోతోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈమూవీ నుంచి ఇప్పుడు శర్వానంద్ తప్పుకున్నాడు అని వార్తలు రావడంతో ఎన్టీఆర్ చిన్న నాటి పాత్రలో మోక్షజ్ఞ నటించడం ఖాయం అంటూ పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ప్రతిరోజు ఒకేచోటుకు జూనియర్ బాలయ్యలు వారివారి సినిమాల షూటింగ్ నిమిత్తం వస్తున్న నేపధ్యంలో ఏదైనా అద్భుతం జరిగి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ స్పాట్ కు జూనియర్ రావాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: