తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కించి తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు.  తెలుగు లో కూడా వ్యూజువల్ వండర్స్ ఇంత అద్భుతంగా తీశారా అన్ని అన్ని ఇండస్ట్రీలు ఆశ్చర్యపోయాయి.  బాహుబలి 2 చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, రాంచరణ్ లతో ఓ మల్టీస్టారర్ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే.   ఒక హీరోయిన్ కీర్తి సురేష్ కంఫర్మ్ అయినా సంగతి తెలిసిందే.

గత కొంత కాలం నుండి ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే రాజమౌళి తీస్తున్న చిత్రం కథ గురించి సోషల్ మీడియాలో రక రకాలుగా వినిపిస్తున్నాయి. అయితే అవి ఏమి నిజం కాదని తేలిపోయింది. రీసెంట్ గా రామ్ చరణ్ వాటిపై స్పందించి అందులో నిజం లేదని స్పష్టం చేశాడు. దాంతో ఈ సినిమా కథ ఏంటో అన్న ఆసక్తి అందరిలో పెరుగుతూ వస్తోంది.

తాజాగా ఇది ఒక   బ్రిటిష్ కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఇందులో బ్రిటిష్ కాలానికి సంబంధించి కార్స్.. బైక్స్..కట్టడాలు.. ఇలా చాలానే ఇందులో చూపించి…అప్పటి సామాజిక వాతావరణం ఇందులో చూపించనున్నారంట.  అంతే కాదు ఈ చిత్రంలో స్వాతంత్ర సమరానికి సంబంధించిన సీన్లు కూడా ఉన్నాయని టాక్. అందుకే  ఈ చిత్రం కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్త వినిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: