నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పుడిప్పుడే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించేలా తయారవుతుంది. నెల దాటుతున్న ఈ రియాలిటీ షోలో ఇప్పటివరకు ఐదుగురు షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ లో హేమా హేమీలు ఉండటం విశేషం. అయితే మొదటి సీజన్ హోస్ట్ చేసిన ఎన్.టి.ఆర్ ఈ సీజన్ బిగ్ బాస్ కు అడ్డుగా మారడం విశేషం.


అదేంటి అంటే ఓ పక్క బిగ్ బాస్ టి.ఆర్.పి రేటింగ్స్ కోసం నానా తిప్పలు పడుతుంటే మరో పక్క యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాత్రం ఈటివి డ్యాన్స్ షో ఢీ 10కు గెస్ట్ గా వెళ్లాడు. ఫైనల్ ఎపిసోడ్ మొత్తం ఎన్.టి.ఆర్ డ్యాన్స్, డైలాగ్స్ తో సందడి చేశాడు. అయితే ఈరోజు ప్రసారమవనున్న ఢీ-10 ఫైనల్ ఎపిసోడ్ పైనే అందరు మొగ్గు చూపుతున్నారు.


ప్రోమోలు కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ లెక్కన బిగ్ బాస్ కు ఈరోజు గండి పడినట్టే. అసలు ఎన్.టి.ఆర్ ఎపిసోడ్ లాస్ట్ వీకే ఉంటుందని ఊహించి లాస్ట్ వెడ్నెస్ డే నాడే అందరు ఢీ-10 చూశారు. కాని అసలు ఫైనల్స్ ఈరోజని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ లో సినిమా షూటింగ్ టాస్క్ అందరు బాగా చేస్తున్నారు.


ప్రస్తుతం కంటెస్టంట్స్ బాబు, గణేష్ లు తప్ప మిగతా వారంతా సినిమా వాళ్లే కాబట్టి ఈ టాస్క్ చాలా చక్కగా చేస్తున్నారు. హీరోలుగా కౌశల్, తనీష్, సామ్రాట్ సీన్స్ రక్తికట్టిస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఓ పక్క ఢీ-10 ఫైనల్ ఓ పక్క ఈరోజు ఆడియెన్స్ కు ఫుల్ పండుగే అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: