రెడ్‌శాండిల్ డాన్ అలియాస్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శ్రీహరి దొరికాడు. కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న శ్రీహరి బుధవారం లొంగిపోయాడు. లాయర్‌ను వెంట పెట్టుకొని వచ్చిన ఈ రెడ్ డాన్.. నేరుగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు వెళ్లి ఐజీ కాంతారావు ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.గత కొన్ని రోజులుగా హరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో చిరుద్యోగిగా పని చేసిన హరిబాబు, ఒకప్పుడు బతుకుదెరువు కోసం టీవీ సీరియల్స్ లో చిన్నచిన్న పాత్రలు వేశాడు.

ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఆ సొమ్ముతో ఇటీవలే ఓ సినిమాకు ఫైనాన్స్ కూడా చేశాడు.  కాగా, బతుకుదెరువు కోసం ఇండస్ట్రీకి వచ్చి తర్వాత ఏకంగా సినిమాలకే ఫైనాన్స్ స్థాయికి ఎదిగిపోయాడు. హైదరాబాద్ వెళ్లాక టీవీ సీరియల్స్‌లో చిన్న, చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. మెల్లిగా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈజీ మనీ కోసం అలవాటు పడి ఎర్రచందనం స్మగ్లర్‌గా మారాడు.  కొంత కాలంగా శ్రీహరి యాక్టివిటీస్ గమినిస్తున్న పోలీసులు చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో చెట్లను నరికి అక్రమంగా సరిహద్దులు దాటించేస్తున్నట్లు పక్క సమాచారం అందుకున్నారు. 
Image result for red sandal smuggler sri hari
బెంగళూరు, చెన్నైలో ఉన్న ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో సంబంధాలు పెంచుకొని.. రూ.కోట్లకు పడగలెత్తాడు. ఈ స్మగ్లింగ్‌పై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పక్కా ఆధారాలను సంపాదించిందట. అతడిపై 10కిపైగా కేసులు నమోదు చేశారు.  పోలీసులు వెతుకుతున్నా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న శ్రీహరి.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు మకాం మారుస్తూ ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి తానే టాస్క్‌ఫోర్స్ ముందు లొంగిపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: