ఎర్రచందనం అక్రమరావాణా కేసులో సినీ నటుడు హరి మంగళవారం టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్టేషన్‌లో లొంగిపోయాడు. న్యాయవాదితో కలిసి టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయానికి చేరుకున్న హరి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు. గత ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. గత కొద్ది రోజులుగా అతని కోసం టాస్క్ పోర్స్‌ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. 

red sandal smuggling case: jabardasth artist srihari surrender to task force

ఒకప్పుడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసే క్యారెక్టర్‌ ఆర్టిస్‌. తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉండిన హరిబాబు ఎర్రచందన స్మగ్లింగ్‌తో కోట్లకు పడగలెత్తాడు. అతను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడని సమాచారం. ఇటీవలే ఓ కమెడియన్‌ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.


ఇదిల ా ఉంటే..తాను ఎర్రచందనం అమ్మి కోట్ల రూపాయలు సంపాదించాననే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని హరి టాస్క్ ఫోర్స్ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. ఒక కానిస్టేబుల్‌ తనపై కావాలనే కేసులు పెట్టిస్తున్నాడని హరి ఆరోపించాడు. అనారోగ్యంతో ఉన్న అమ్మను కాపాడుకోవడానికే ఒకసారి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశానని హరి అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే, తాను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పట్టించానని, ఆ కోపంతో తనపై పగను పెంచుకున్న కానిస్టేబుల్ తనపై అనేక తప్పుడు కేసులు పెట్టి ఇరికించాడని చెప్పాడు.  


 జబర్దస్త్‌ షో తో పాటు శంభో శంకర సినిమాలో నటించిన హరి...శంభో శంకర సినిమాకు ఫైనాన్స్‌ కూడా చేసినట్లు తెలిసింది. అలాగే మరికొన్ని సినిమాలకు కూడా ఫైనాన్స్ చేసేందుకు ఇతడు అంగీకరించినట్లు సమాచారం. గత ఐదు రోజులుగా అతని కోసం గాలిస్తుండగా, తన న్యాయవాదితో పాటు వచ్చిన హరి, తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయాడన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: