ప్రిన్స్ మహేష్ బాబు వయస్సు 45 సంవతరాలకు దగ్గరలో ఉన్నా అమ్మాయిల్లో మహేష్ పట్ల ఉండే క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనితో మహేష్ వయస్సుతో సంబంధం లేకుండా    అమ్మాయిల కలల రాజకుమారుడుగా మహేష్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉన్నాడు.   మహేష్ బాబు గ్లామర్ రహస్యం ఎవరికీ అంతు చిక్కని రహస్యంగా మారడంతో ఎవరు అడిగినా టెన్సన్స్ కు దూరంగా ఉండటమే తన గ్లామర్ సీక్రెట్ అని అంటున్నాడు. 
సినిమాలు, యాడ్స్
ఒక వైపు సినిమాలలో నటిస్తూనే పలు అంతర్జాతీయ బ్రాండ్స్ కు మహేష్ బ్రాండ్ అంబాసడర్ గా కొనసాగుతూ కోట్లు గణిస్తున్న విషయం తెలిసిందే. వాణిజ్య ప్రకటనల ఆదాయం విషయంలో మహేష్ ముందు ఏ తెలుగు హీరో సరిపోడు. ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా ఒక ప్రముఖ వాణిజ్య  సంస్థ తమ షోరూమ్ ను ప్రమోట్ చేస్తూ మహేష్ తో భారీ ఖర్చుతో ఒక యాడ్ రూపొందించింది. ఈయాడ్ ను ఒక ప్రముఖ బాలీవుడ్ యాడ్ మేకర్ నిర్మిస్తున్నాడు. 
కళ్ళు చెదిరే లుక్
యాడ్ షూటింగ్ ఈమధ్య ముంబైలో జతగడంతో ఆషూటింగ్ స్పాట్ నుండి ఈ ఫోటో లీక్ అయింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో  త్రెందింగ్ గా మారి మహేష్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. హాట్ అమ్మాయిల మధ్యలో మహేష్ కళ్ళు చెదిరే స్టైలిష్ లుక్ లో  కనిపిస్తున్న మహేష్ లుక్ ను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 
వైరల్
అమ్మాయిల చూపు తిప్పుకోలేని విధంగా ఉన్న మహేష్ లుక్ ను చూసి ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ పెడుతూ ఈ ఫోటోని ఈరోజు ట్రెండింగ్ గా మార్చారు. మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారిన ఈఫోటో మిగతా టాప్ హీరోల అభిమానులను కూడ ఆకర్షిస్తోంది అంటే మహేష్ లుక్ ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: