ప్రతి వ్యక్తికి  ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మితిమీరిపోతే అది వ్యసనంగా మారుతుంది. ఈ విషయంలో మన సెలెబ్రెటీలు కూడ అతీతులు కారు. మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఒక విచిత్రమైన బలహీనత ఉందట. 
Sai Dharam Tej One more Remake Song
సామాన్యంగా మన హీరోలు తమ సినిమాల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు వారికి బాగా ఇష్టమైన ఖరీదైన వాచ్ లు కళ్ళజోళ్ళు కొనడం చేస్తూ ఉంటారు. మహేష్ బాబు ఇంట్లో అయితే వందల సంఖ్యలో రకరకాల వాచ్ లు ఉన్నాయని నమ్రత ఆమధ్య ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే సాయి ధరమ్ తేజ్ కు ఉన్న బలహీనత ఎవరి ఊహలకు అందనిది. తేజ్ కు చిన్నప్పటి నుంచి బొమ్మలు అంటే చాల సరదా అని టాక్. బొమ్మలు అంటే ఏవో రొటీన్ బొమ్మలు కావు. 
Sai Dharam Tej takes break, heads to US
ఖరీదైన రిమోట్ కార్లు, వైర్ లెస్ టాయ్స్ ఇలా రకరకాల టాయ్స్ పై తేజ్ కు చిన్నప్పటి నుంచి సరదా. అయితే ఈబోమ్మల సరదా తేజ్ కు తన చిన్నప్పుడు పూర్తిగా తీరకపోవడంతో అతడు తన సినిమాల షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లినపుడు మన ఇండియాలో దొరకని రకరకాల ఖరీదైన టాయ్స్ ను ఏది కనిపిస్తే అవి కొంటాడట. ఇప్పటికే ఆ టాయ్స్ సంఖ్య వందలలోకి చేరడంతో తేజ్ ఇంట్లో వాటికి ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 
Sai Dharam Tej Reveals About His Next Film
ఆశ్చర్యం ఏమిటంటే తేజ్ చిన్నతనంలో తన బొమ్మల సరదా కోసం డబ్బు గణించదానికి వరుణ్ తేజ్ నీహారికలతో కలిసి కాఫీడే షాపులో పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో బొమ్మలు కొనేవాడట. ఆ బొమ్మలతో కొద్దిరోజులు తన సరదా తీర్చుకుని ఆతరువాత వాటిని స్ట్రీట్ చిల్డ్రన్ లాంటి వాళ్లకు ఇవ్వడం తేజ్ అలవాటు అని తెలుస్తోంది. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ తన కారులో కూడ రెండు రోజులకు ఒకసారి ఒక కొత్త బొమ్మను మార్చే అలవాటు కూడ ఉందట. తేజ్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విచిత్రమైన ఈ బలహీనతను బయటపెట్టాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: