బాలీవుడ్‌ మెగస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.తాజాగా బిగ్‌ బీ చేసిన ఒక ట్వీట్‌ మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. బిగ్‌ బీ కుటుంబం నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బిగ్‌ బీ, తన కూతురు శ్వేతా నందాతో కలిసి ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో నటించారు. ప్రకటనలో కూడా అమితాబ్‌, శ్వేతా ఇద్దరూ తండ్రి కూతుళ్లుగానే నటించారు. తాజాగా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Image result for అమితాబ్ బచ్చన్ యాడ్
ఈ యాడ్ బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని, బ్యాంకులను అవమానకరంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపైనే అపనమ్మకాన్ని కలిగించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  వారి వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల్లో అపనమ్మకం కల్గించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బ్యాంకు సంఘాల ఆరోపణలను కల్యాణ్ జువెల్లర్స్ కొట్టిపడేసింది. అది ఎవరినీ ఉద్దేశించి తీసినది కాదని, ఫిక్షన్ మాత్రమేనని తేల్చి చెప్పింది. 
 Image result for అమితాబ్ బచ్చన్ యాడ్
అయితే యాడ్ లో కావడంతో రెండో నెల పింఛన్ బ్యాంకుకు తిరిగి ఇచ్చేందుకకు పింఛన్ దారుడు (అమితాబ్) తన కుమార్తెతో కలిసి బ్యాంకుకు వస్తాడు. రెండు కౌంటర్లలోని ఉద్యోగులు తొలుత అమితాబ్‌ను అవమానిస్తారు.దీంతో ఏం పర్లేదు పింఛన్ ను ఉంచుకోమని చెబుతాడు. ఎవరికి తెలుసని, ఎవరు చూస్తారని చెబుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇందుకు అమితాబ్ ఒప్పుకోడు. తనకు నమ్మకమే ముఖ్యమని అమితాబ్ చెప్పిన వెంటనే కల్యాణ్ జువెల్లర్స్ అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. 

నమ్మకానికి పెట్టింది పేరు కళ్యాన్ జువెల్లర్స్ అంటూ యాడ్ ముగిసిపోతుంది. కాగా ఈ ఆరోపణలను సదరు అభరణాల సంస్థ తోసిపుచ్చింది. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని పేర్కొంది. బ్యాంకర్లు చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు సౌమ్య దత్తాకు  లేఖ రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: