అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా సుమంత్ మొదట్లో కాస్త హంగామా చేసినట్టుగా కనిపించినా స్టర్ ఇమేజ్ సంపాదించడంలో ఫెయిల్ అయ్యాడు. రీసెంట్ గా మళ్లీరావా సినిమాతో హిట్ అందుకున్న సుమంత్ కొత్త టర్న్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇక అదే క్రమంలో సుమంత్ హీరోగా వస్తున్న సినిమా ఇదం జగత్.


ఈ సినిమాలో సుమంత్ క్యారక్టర్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్. కాస్త నెగటివ్ షేడ్స్ తో ఉన్న పాత్రలో కనిపిస్తాడట సుమంత్. మళ్లీరావా తర్వాత సుమంత్ చేస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఇన్నాళ్లకు సుమంత్ కరెక్ట్ ట్రాక్ లో పడ్డాడని చెప్పొచ్చు.


కెరియర్ లో సుమంత్ మొదటిసారి ఇలాంటి ప్రయోగాత్మక రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. అనీల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్న ఇదం జగత్ సినిమాను విరాట్ ఫిల్మ్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమాస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచింది.


ఈ సినిమాతో పాటుగా సుమంత్ సుబ్రమణ్యపురం సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈమధ్య ఆడియెన్స్ మైండ్ సెట్ మారడంతో వారి ఆలోచనలకు అనుగుణంగా హీరోలు సినిమాల పంథాలను మార్చారు. ఆ క్రమంలో సుమంత్ చేస్తున్న ఈ రెండు సినిమాలు తప్పకుండా ఆడియెన్స్ ను అలరించేలా ఉంటాయని చెబుతున్నారు. మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: