యంగ్ టైగర్ ఎన్టీఆర్ `సెలెక్ట్` మొబైల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఒప్పందం కుదిరిన‌ విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిచయం చేస్తూ.. శుక్ర‌వారం నిర్వహించిన పాత్రికేయుల స‌మావేశంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సెలెక్ట్ మొబైల్స్ యాజమాన్యం విధేయత, ఎదగాలనుకునే తత్వం, బ్రాండ్ ఎంపిక చేసే పద్ధతిలో నూతనత్వం ఈ మూడు తనను ఈ ప్రోడక్ట్‌కు అంబాసిడర్‌గా ఉండేందుకు ప్రేరేపించాయని తెలిపారు. అంతేకాకుండా, ఏదో మొబైల్ షాప్‌కి వెళ్లి మొబైల్ కొనుకున్నాం అన్నట్టు గాకుండా.. వినియోగదారుడికి ఆ ప్రోడక్ట్‌పై అవగాహన కల్పించే పద్ధతి కూడా త‌న‌కు బాగా నచ్చిందని చెప్పారు.


జీవితంలో సెల్‌ ఫోన్ కామన్ అయిపోవటమేకాదు క్రమంగా దేహంలో కూడా భాగమౌతున్న రోజులివి.  ఆయితే ఈ రోజుల్లో తనకు మొబైల్స్‌ తో ఉన్నఒక రకమైన అయిష్టతతో కూడిన  అనుబంధాన్ని బయట పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనకు సెల్‌ఫోన్ ఏ సందర్భాల్లో ఇష్టం ఉండదో, ఎప్పుడు అవసరమో ఆయన వివరించాడు. 


*మొబైల్స్‌లో ఫొటోలు తీసుకోవడం మరియు 
*సెల్ఫీలకు ఫోజులివ్వడం తనకు నచ్చదని చెప్పాడు తారక్. 

junior ntr family photos కోసం చిత్ర ఫలితం

`ఫోన్ ఎక్కువగా వాడతారా? సెల్ఫీలు బాగా దిగుతారా?` అనే ప్రశ్నకు స‌మాధానంగా..‘ప్రపంచం మారిపోయింది. ఏమీ లేకున్నా స‌రే.. సరదాగా ఫోన్ వైపు చూస్తున్నాం నేను కూడా అందుకు మిన‌హాయింపు కాదు. అయితే.. నేను అసలు ఫొటోలే దిగను. నాకు పోజ్ ఇవ్వడం అంటే ఎందుకో నచ్చదు. అదంటే నాకు వణుకు వస్తుంది. నా భార్య  ప్ర‌ణ‌తి కూడా నా ఫొటోలు తీస్తానని అంటుంది. కానీ, నాకేమో పోజులివ్వడం చేత‌కాదు.’ అని చెప్పుకొచ్చారు.


తనకు, తన భార్యకు మధ్య గొడవ జరిగేది పై రెండు సందర్బాల్లోనే నని చెప్పాడు ఎన్టీఆర్. “నాకు ఫొటోలకు పోజులివ్వడం మహా చిరాకు, విసుగు తెప్పిస్తాయి. నా శ్రీమతికి నాకు ఈ విషయంలో ఎప్పుడూ గిల్లికజ్జాలు తప్పట్లేదు. ఫొటోలకు ఎందుకు పోజులివ్వవని తను నాతో తరచుగా పోట్లాడుతు ఉంటుంది. అయితే సెల్‌ఫోన్‌ లో తీసిన ఫొటోలన్నీ నా భార్య స్టోర్ చేస్తుంది. నాకయితే ఫొటోలు దిగడమే ఇష్టముండదు” అని ఎన్టీఆర్ చెప్పారు.  

junior ntr family photos కోసం చిత్ర ఫలితం

నేను మొబైల్‌ కు ఎంతగా దూరంగా ఉండాలని ప్రయత్నించినా అది అంత దగ్గరౌతూ వస్తుంది. దూరంగా ఉండటం కుదరడం లేదని అంటున్నాడు యంగ్ టైగర్. కనీసం మూడు నెలలైనా సెల్‌ఫోన్ లేకుండా కాలం గడిపెయ్యాలనేది తన కోరికని అయితే “నా చేతికి మొబైల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అది తోడు లేకుండా నేను లేను. కాకపోతే మొన్ననే అనుకున్నాను. వీలైతే డిజిటల్ డిటాక్సికేషన్ (మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం) కు ప్రయత్నించాలని అనుకుంటున్నాను" అని తన తీరని కోరికను వెలిబుచ్చారు. 


కనీసం మూడు నెలల పాటు మొబైల్ లేకుండా ఉండాలనేది నా ప్రయత్నం నీరుగారి పోతోంది. ఈరోజుల్లో మొబైల్ లేకుండా గడపటం అసాధ్యమని అనుకుంటున్నా. ఫీచర్స్ వాడకపోయినా కనీసం మాట్లాడుకోవడానికి అయినా అది ఉండాలి కదా? మొబైల్ లేకుండా ఉండాలనే నా కోరిక ఎప్పటికైనా తీరుతుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు చాలా తక్కువ సందర్భాల్లో సెల్ - ఫోన్ వాడుతున్నా” అని ఎన్టీఆర్ చెప్పాడు. 


తన కాలేజీ రోజుల్లో కొన్న మొదటి సెల్‌ఫోన్ అనుభవాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు. అబిడ్స్ జగదీష్ మార్కెట్‌ లో సెకండ్‌-హ్యాండ్ ఫోన్ కొనుక్కున్న దశ నుంచి ప్రస్తుతం వాడుతున్న ఐఫోన్ వరకు తన మొబైల్ అనుభవాన్ని తెలియజేశాడు. 

NTR and mobile phone  కోసం చిత్ర ఫలితం

"నా కాలేజ్ రోజుల్లో నా ఫస్ట్-ఫోన్ కొన్నాను. అదీ జగదీష్ మార్కెట్‌కు వెళ్లి ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నాను. ఆతర్వాత మెల్లి మెల్లిగా ఒక్కొక్క ఫోన్ ను మార్చుతూ వచ్చానని ఇప్పుడు మాత్రం ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వచ్చేశానని అన్నారు. మొబైల్ ఫోన్‌ లో నా ఫేవరేట్ అంటే గేమింగ్ అని చెబుతాను. ఎప్పటి కప్పుడు ఏదో ఒక గేమ్ డౌన్‌-లోడ్ చేసి ఆడడం నాకిష్టం. 


నా మొబైల్‌ లో యాప్స్ కంటే గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. యూట్యూబ్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది నా కోసం కాదు. నా కొడుకు అందులో రైమ్స్ చూస్తుంటాడు. అప్పుడప్పుడు నా ఇంటర్వూలు కూడా’ అని పేర్కొన్నాడు ఎన్టీఆర్.

NTR about Best Incident With Phone and Success Mantra, Jr NTR Press Meet about Celekt Mobiles, NTR Jr at Celekt Mobile Store Launch, Jr NTR Speech at Celekt Mobiles Brand Launch, Tarak About His Phone Usage, Telugu FilmNagar, Tollywood Celebs Latest News, Young Tiger NTR Latest Interview, Tollywood Latest Updates, Celekt Mobile Brand Launch Event

మరింత సమాచారం తెలుసుకోండి: