బుధవారం బిగ్ బాస్ షో చూడటం కన్నా ఢీ-10 మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు బుల్లితెర ఆడియెన్స్. ఎందుకంటే గ్రాండ్ ఫైనల్స్ కు ఆ షోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చాడు. అయితే ఢీ ముగిసిందో లేదో బిగ్ బాస్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బిగ్ బాస్-2 మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇంట్లోకి పంపించాడు.


అతనెవరో కాదు క్రేజీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. బుల్లితెర ప్రేక్షకులకు ప్రదీప్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను ఎలాంటి షో చేసినా రేటింగులలో టాప్ లో ఉంచే ప్రదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా భారీ రెమ్యునరేషన్ తోనే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ మొదలై నెల గడుస్తున్నా ఓ మోస్తారుగా సాగుతుండగా ప్రదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ కూడా అదిరిపోద్దని అంటున్నారు. 


ప్రదీప్ ఎంట్రీ ఇవ్వడమే కాదు ఇంటి సభ్యులందరికి ఓ సర్ ప్రైజ్ కూడా తెచ్చాడు. అందరిని కూర్చోబెట్టి అందరి గురించి మాట్లాడి వారి మనసులను గెలిచాడు. చూస్తుంటే బిగ్ బాస్ కూడా ఇక ప్రదీప్ కామెడీతో అలరిస్తుందని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టే ప్రదీప్ బిగ్ బాస్ లో ఎలా ఉంటాడో చూడాలి.


ఇక ఈ వారం ఎలిమినేషన్ లో దీప్తి, తేజశ్వి, సామ్రాట్, తనీష్, రోల్ రైడా ఉన్నారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇప్పటిదాకా ఐదుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవగా ఈ వారం ఎలిమినేషన్ తో ఆరుగురు బయటకు వచ్చేసినట్టు అవుతుంది. ఎలిమినేషన్ కు ముందే ప్రదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరికి సర్ ప్రైజ్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: