బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న షో.. ఇప్పుడందరూ దీని గురించే చర్చిస్తున్నారు.  బిగ్ బాస్ సీజన్ 1 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత బిగ్ బాస్ సీజన్ లో శివబాలాజీ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.  ఆ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దీక్షాపంత్, నవదీప్ లు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 2 లో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు.  సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ.  అయితే ఇప్పటి వరకు బిబ్ బాస్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఇస్తున్నారన్న విషయం పై క్లారిటీ రాలేదు.  కాకపోతే మొన్నటి వరకు హెబ్బా పటేల్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి.  


అయితే దీనిపై స్పందించిన హెబ్బా తాను తన ఇంట్లోనే ఉన్నానని ఏ ఇంట్లోకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది.  బిగ్ బాస్ 2 సీజన్ లో మొదట కాస్త చప్పగా సాగినా మూడో వారం నుంచి రసవత్తరంగా సాగుతుంది. వెరైటీ టాస్క్ లతో ఇంటిసభ్యులు అలరిస్తున్నారు.  హోస్ట్ నాని ప్రతి శని - ఆదివారాలు సందడి చేసి హైప్ పెంచుతున్నాడు.   తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ లోకి బుల్లి తెర హాట్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు  ఈ రాత్రి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 


ఈ మేరకు తాజాగా రిలీజ్ అయిన ప్రోమో వైరల్ గా మారింది.   యాంకర్లలోకెల్ల అత్యంత చురుకైన వాడు.. ప్రదీప్ చేస్తున్న షోలన్నీ టాప్ రేటింగులతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ మేనియాను క్యాష్ చేసుకొని మరింత హైప్ పెంచడానికి అతడిని తాజాగా బిగ్ బాస్ ఇంట్లోకి పంపించి బిగ్ బాస్ టీం అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. తాజాగా  ప్రదీప్ ఎంట్రీ ఇవ్వగానే వారంతా ఆశ్చర్యపోయారు.   


ప్రదీప్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే తన మార్కు కామెడీతో చెలరేగిపోయారు. ఒక్కో ఇంటిసభ్యుడు చేసిన సరదా పనులను వారికి వివరిస్తూ కామెడీ చేస్తూ అలరించాడు. వారు చేసిన మంచు పనులు చెప్పి కన్నీళ్లు పెట్టించాడు.  కానీ చివర్లో మాత్రం ఓ ట్విస్ట్ ఇచ్చారు..తాను బిగ్ బాస్ ఇంటినుంచి పోకుండా ఉండాలంటే మీరంతా ఓ ప్రయత్నం చేయాలని చెప్పాడు. మరి ప్రదీప్ కంటిన్యూ చేస్తారా..లేదా గెస్ట్ అప్పీరియన్స్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: