కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ గా అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆరెక్స్ 100. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. హీరోయిన్ కోసమే రిపీటెడ్ ఆడియెన్స్ వెళ్తున్నారని చెప్పొచ్చు.  


యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో పాటుగా విపరీతమైన మౌత్ పబ్లిసిటీతో ఆరెక్స్ 100 కలక్షన్ల బీభత్సం సృష్టిస్తుంది. సినిమాలో సీనియర్ హీరో రాంకీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాడు.


ఈ సినిమా కలక్షన్స్ హంగామా చూస్తుంటే లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి చిన్న సినిమాగా వచ్చి కలక్షన్స్ అదరగొడితే.. ఈ ఇయర్ ఆరెక్స్ 100 మరో అర్జున్ రెడ్డి అనేస్తున్నారు. ఈ సినిమా వారం రోజుల కలక్షన్స్ చూస్తే అందరు షాక్ అవుతున్నారు. ఏరియాల వారిగా ఈ సినిమా వసూళ్ల లెక్కలు చూస్తే..


నైజాం : 3.65 కోట్లు
సీడెడ్ : 0.88 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.86 కోట్లు
గుంటూర్ : 0.50 కోట్లు
ఈస్ట్ : 0.59 కోట్లు
వెస్ట్ : 0.44 కోట్లు
కృష్ణా : 0.48 కోట్లు
నెల్లూరు : 0.17 కోట్లు
ఏపి/ తెలంగాణా : 7.57 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.30 కోట్లు
ఓవర్సీస్ : 0.30 కోట్లు
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఆరెక్స్ 100 వారం రోజుల కలక్షన్స్ 8.17 కోట్ల షేర్ వసూళు చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: