సినిమా సెలెబ్రిటీల మధ్య ముఖ్యంగా  హీరో హీరోయిన్ల మధ్య ఏదో  నడుస్తోంది అంటూ వార్తలు రావడం సర్వసాధరణ విషయంగా మారింది.   సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలను బేస్ చేసుకొని వస్తున్న కథనాల గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో ఇలాంటి వార్తలకు బాగా ప్రచారం లభిస్తోంది.
Prabhas, Niharika Konidela
చాలా రోజులుగా మెగా డాటర్ నిహారిక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అటు మెగా ఫ్యామిలీ ఇటు ప్రభాస్ ఫ్యామిలీ కూడా ఖండనలు ఇస్తూ  క్లారిటీ ఇచ్చారు.  అయినా ఈ న్యూస్ సృష్టించిన అలజడి ఇంకా చాలమందికి గుర్తు ఉంది. ఇలాంటి నేపధ్యంలో నిహారిక ప్రభాస్ లు ఇప్పుడు ఒకవేదిక పై కనిపించబోతున్నారు అన్న వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. 
rumours-on-mega-daughter-niharika-happy-wedding-movie
ప్రభాస్ సన్నిహితుల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తీస్తున్న ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా త్వరలో రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 21న హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చిన విషయం  తెలిసిందే. పెళ్లి చుట్టూ తిరిగే కథను అద్భుతంగా తీశారు అన్న ప్రీ రిలీజ్ టాక్ వినిపిస్తోంది. 
Chiranjeevi
సుమంత్ అశ్విన్ హీరోగా నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ప్రమోట్ చేయడానికి ప్రభాస్ ఈ సినిమా నిర్మాతలతో తనకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈమూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిధిగా రావడానికి ప్రభాస్ అంగీకరించాడు అని అంటున్నారు. ఈమధ్య కాలంలో మెగా హీరోల వేడుకలన్నింటికి హాజరు అవుతున్న  చిరంజీవి కూడా కూతురు నిహారిక ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వస్తాడని ఫిలింనగర్ టాక్. ఈవార్తలే నిజం అయితే ప్రభాస్ నిహారికల పై గతంలో వచ్చిన గాసిప్పులు నిజం అవ్వకపోయినా అనుకోకుండా ‘హ్యాపీ వెడ్డింగ్’ కోసం ఈవిధంగా కలుస్తున్నారనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: