సింగర్ సునీత తన భర్త కిరణ్ నుండి విడిపోయి చాలా రోజులవుతుంది. సింగిల్ మదర్ గా ఆమె తన ఇద్దరి పిల్లలతో జీవనం సాగిస్తుంది. సింగర్ గా ఆడియెన్స్ అందరు గుర్తించే సునీత డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అందరికి సుపరిచితమే. అయితే సునీత మరో పెళ్లికి రెడీ అయ్యిందని లేటెస్ట్ న్యూస్.


సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ వార్తలు సునీత దాకా వెళ్లడంతో ఆమె స్పందించక తప్పలేదు. ఇది నిజామా కాదా అని తెలుసుకోకుండా కొందరు ఆమెకే డైరెక్ట్ గా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారట. అయితే తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై ఖండించింది సునీత. ఇతరుల పర్సనల్ లైఫ్ విషయాల పట్ల మీడియాకు అంత ఆసక్తి ఎందుకని ఫైర్ అయ్యింది.


అయితే పెళ్లి గురించి మాట్లాడే సమయం, సందర్భం ఇది కాదని. నాయనమ్మ చనిపోయి నెల రోజులవుతుందని ఆ పనుల్లో తాము ఉండగా ఈ వార్తలు పుట్టించారని అన్నది సునీత. పెళ్లిపై పాజిటివ్ గా స్పందించిన తన సన్నిహితుల పట్ల సునీత సంతోషాన్ని వ్యక్తపరచింది. 


ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ఫేస్ బుక్ చాట్ లోకి వచ్చింది సునీత. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పిన అమ్మడు అది వస్తే కనుక తప్పకుండా ముందు మీడియా ముందు ప్రకటిస్తానని అన్నది సునీత. ప్రస్తుతం కెరియర్ ఆశాజనకంగా లేని సునీత అడపాదడపా పాటలు పాడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: