ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే.


ఇప్పటికే ఈ సినిమా నుండి మెగాస్టార్ లుక్ లీక్ అవ్వగా సైరాలో అమితాబ్ నరసింహారెడ్డి గురువుగా ఉన్న లుక్ కూడా రివీల్ అయ్యింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సైరా నుండి ఓ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గుర్రాల మీద కనిపిస్తున్నట్టుగా లీకైన ఫోటో ఎన్నో విషయాలను బయటపెడుతుంది.


సినిమా కొంత భాగం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు సినిమా కోసం అప్పటి నాగరికత, దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. లీకైన పిక్స్ కాదు సైరాలో చిరు అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.  


ఇప్పటికే హాలీవుడ్ టెక్నిషియన్స్ తో ఈ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేయిస్తున్నారు. యాక్షన్ పార్ట్, ఫైట్స్, యుద్ధాలు ఈ సినిమా బాహుబలిని మించి ఉండేలా చూస్తున్నారట. లీకైన పిక్ అబ్సర్వ్ చేస్తే చెట్టు కింద గుర్రాల మీద డిస్కషన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో నరసింహారెడ్డి ఉన్నాడో లేదో అన్నది క్లియర్ గా తెలియట్లేదు. అయితే ఈ లీకులు కూడా సైరా మీద మరింత అంచనాలను పెంచేస్తున్నాయి.     



మరింత సమాచారం తెలుసుకోండి: