ఒకప్పుడు భారత దేశంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాత్ అల్లుడు పాడిన ‘కొలవెరి’సాంగ్ గుర్తుంది కదా..ఆ పాట కంపోజ్ చేసిన కుర్రాడు అనిరుథ్ ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు.  తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎదిగి టాలీవుడ్‌లో `అజ్ఞాత‌వాసి`తో అరంగేట్రం చేశాడు అనిరుధ్‌. స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో సినిమాతో ఎంట్రీ ఇస్తుండ‌డంతో అనిరుధ్‌పై అంచ‌నాలు తార‌స్థాయికి చేరిపోయాయి. కాకపోతే అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పటికీ మ్యూజిక్ పరంగా మంచి హిట్ అయ్యింది.
Image result for agnathavasi anirudh
ఎన్టీయార్‌తో త్రివిక్ర‌మ్ చేస్తున్న `అర‌వింద స‌మేత‌`కు కూడా మొద‌ట‌గా అనిరుధ్‌నే సంగీత ద‌ర్శ‌కుడు అని ప్ర‌క‌టించారు. అయితే `అజ్ఞాత‌వాసి` ఎఫెక్ట్ కార‌ణంగా ఆ అవ‌కాశం థ‌మ‌న్‌ను వ‌రించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనిరుథ్ కి తెలుగు లో మరో ఛాన్స్ వచ్చింది.
Image result for agnathavasi anirudh
నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `జెర్సీ`కి సంగీతం అందించే అవ‌కాశం అనిరుధ్‌కు వ‌చ్చింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ అయితే బాగుంటుందని భావించి ఆయనను సంప్రదిస్తే .. ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: