వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన నోటికి మరోసారి పనిచెప్పింది.  ఇప్పటి వరకు సోషల్ మాద్యమాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి ఈ దివంగత టీడీపీ నేత పరిటాల రవిని గుర్తు చేసింది.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని  అవకాశాల పేరుతో తనను వాడుకున్న టాలీవుడ్ ప్రముఖుల పుత్రరత్నాలు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి ఒక్కో పేరును రివీల్ చేస్తూ.. పెద్ద లిస్ట్‌నే సోషల్ మీడియాలో ఉంచి ప్రకంపనలు రేపింది శ్రీరెడ్డి. 
Image result for PAWAN KALYAN SRI REDDY
కాకపోతే ఆమె ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీ గరం అవుతున్నారు. తాజాగా స్వర్గీయ తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి పేరును ప్రస్తావిస్తూ.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఇన్ డైరెక్ట్‌ కామెంట్ చేసింది. ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, ట్రు హీరోరా పరిటాల రవిగారు. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు సీఎం అవకుండా కాపాడేవారు.
Image result for PAWAN KALYAN SRI REDDY
గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగ్స్ చెప్తే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి’’ అంటూ పరోక్షంగా పవన్ ని గుర్తుచేస్తుంది. కాగా శ్రీరెడ్డి పోస్ట్ పై పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ మరోసారి ఫైర్ అయ్యారు. చెగువేరా, గడ్డం, జుట్టుకు రంగు లాంటి వ్యాఖ్యలు గతంలో పవన్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేయడంతో పవన్ అభిమానులు శ్రీరెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.  తనకు ఎన్ని సార్లు బుద్ది వచ్చేలా కౌంటర్ ఇచ్చినా శ్రీరెడ్డి పిచ్చి పీక్ స్టేజ్ దాటిందని..హద్దు మీరి కామెంట్స్ చేస్తుంటే..ఇక ఊరుకునేది లేదని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: