సూర్య హీరో గా నటిస్తున్న సినిమాలో అల్లు శిరీష్ కూడా నటిస్తున్నాడని కొన్ని రోజుల క్రితం వరకు అందిరికీ తెలిసిందే. స్వయంగా అల్లు శిరీషే సూర్య సినిమా లో నటిస్తున్నాని ప్రకటించాడు. అయితే ఇప్పుడు మాత్రం అల్లు శిరీష్ ఆ సినిమా లో నటించడం లేదని అతనే ప్రకటించాడు. అతను ఏమన్నాడంటే , ఇప్పటికే నేను ఒప్పుకున్న ABCD అనే సినిమాతో డేట్స్ సమస్య వచ్చింది. అందుకే సూర్య సినిమా నుంచి తప్పుకుంటున్నాను. రెండు సినిమాలకు డేట్స్ ఎడ్జెస్ట్ చేయడం కష్టంగా మారింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేవీ ఆనంద్ సర్ ఆఫర్ చేసిన పాత్ర నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను."

Image result for allu sirish

నిజంగా ఈ సినిమా నేను చేయాలనుకున్నాను. కానీ తప్పుకోక తప్పడం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేవీ ఆనంద్ సర్, సూర్య సర్, లైకా ప్రొడక్షన్స్ కు కృతజ్ఞతలు. టోటల్ టీమ్ కు నా శుభాకాంక్షలు. వీలైతే భవిష్యత్తులో ఈ టీమ్ తో కలిసి నటించాలనుకుంటున్నాను. ఇలా తను చెప్పాలనుకున్నది చెప్పి ముగించాడు అల్లు శిరీష్. కానీ ఇక్కడ శిరీష్ కు అర్థంకాని విషయం, జనాలకు ఇప్పటికే తెలిసిన విషయం ఒకటుంది.

Image result for allu sirish

ఈ ప్రాజెక్టు నుంచి అల్లు శిరీష్ ను దాదాపు 10రోజుల కిందటే తీసేశారు. అంతేకాదు, అతడి స్థానంలో ఆర్యను తీసుకున్నారు. అక్కడితో మేటర్ పూర్తవ్వలేదు. ఆర్యతో కలిసి యూనిట్ అంతా విదేశాలకు కూడా వెళ్లింది. షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. సూర్య, కేవీ ఆనంద్ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆర్య ప్రకటించాడు కూడా. ఇదంతా జరిగిన ఇన్ని రోజులకు తనే స్వయంగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానంటూ అల్లు శిరీష్ కవరింగ్ ఇచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: