శుక్రవారం వస్తే బిగ్ స్క్రీన్ లో కొత్త సినిమా బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్ వచ్చేస్తాడు. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది. ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ప్రొడక్షన్స్ లో చేసిన సినిమా బాపతుగా ఇచ్చిన రెమ్యునరేషన్ లో హయ్యెస్ట్ గా ఎవరు డబ్బులు కలిగి ఉంటారో వారే కెప్టెన్ టాస్క్ లో పాల్గొంటారు.


ఈ క్రమంలో తనీష్ ఎక్కువ డబ్బులు కలిగి ఉండటం వల్ల తనీష్ తో పాటుగా నిర్మాతగా చేసిన బాబు గోగినేని, డైరక్టర్ గా చేసిన అమిత్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. టమాటాలను తొక్కుతూ వాటి రసాన్ని బకెట్ లో పట్టే టాస్క్ లో ఫైనల్ గా తనీష్ విన్ అయ్యాడు. తద్వారా ఈవారం కెప్టెన్ గా తనీష్ బాధ్యతలు తీసుకున్నాడు.


అయితే ఇలా కెప్టెన్ అయ్యాడో లేదో బడ్జెట్ టాస్క్ చాలా ఈజీ చేశాడు. ఇక తను క్లోజ్ గా ఉండే దీప్తి సునైనతో గొడవ కూడా ఈనాటి ఎపిసోడ్ లో హైలెట్ గా నిలిచింది. ఇక ఓ పక్క కౌశల్ మళ్లీ నందినిని తన వైపుకు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నాడు. ఆమె ఆల్రెడీ మళ్లీ గీతా మాదురి, దీప్తిల మధ్య కౌశల్ గురించి ప్రస్థావించింది.


హౌజ్ లో ఎవరికి వారు తమ ప్లాన్స్ లో ఉన్నారు. ఈరోజు షో మొదలవడానికి ముందు నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ వచ్చి అలరించిన ప్రదీప్ హౌజ్ అందరి ఇళ్ల దగ్గర నుండి సమాచారం తీసుకుని వచ్చాడు. ఫైనల్ గా అతను వచ్చింది పెళ్లిచూపులు అన్న మరో కాన్సెప్ట్ షో ప్రమోషన్ కోసమని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: