బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టంట్స్ ఎన్.టి.ఆర్ వచ్చే దాకా షోని ఎంతో క్రేజీగా నడిపించారు. కేవలం టాస్క్ టైంలో గొడవలు తప్పితే ఎవరు ఎవరిని టార్గెట్ చేసింది లేదు. అయితే ఈ సారి బిగ్ బాస్ లో ఎవరికి వారు సొంత స్కెచ్ లు వేసుకుంటున్నారు. ఒకరు చెప్పిన విషయాన్ని మరొకరి చెప్పడం లాంటివి జరుగుతున్నాయి.


హోస్ట్ గా నాని శని, ఆదివారాలు మాత్రమే బిగ్ బాస్ ను కాపాడుతున్నాడు. మధ్యలో వారం మొత్తం అంత ఎక్సైటింగ్ గా అనిపించడం లేదు. అందుకే శుక్రవారం నాడు బుల్లితెర బిజీయెస్ట్ యాంకర్ ప్రదీప్ ను బిగ్ బాస్ ఇంట్లో పంపించారు. ప్రదీప్ రావడంతో బుల్లితెర ప్రేక్షకులకు ఓ సర్ ప్రైజ్ గా అనిపించింది. 


ఏ టివిలో అయినా.. ఏ షో అయినా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సక్సెస్ అవుతున్న ప్రదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం బిగ్ బాస్ కు కొత్త కళ తెచ్చింది. అయితే యాంకర్ వచ్చింది కేవలం గెస్ట్ గానే తప్ప వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కాదు. నీరసంగా సాగుతున్న ఎపిసోడ్స్ ను కాస్త ఇంట్రెస్ట్ పెంచేందుకు మాత్రమే ప్రదీప్ వచ్చినట్టు అనిపిస్తుంది.  


ఇక పనిలో పనిగా తాను తర్వాత చేయబోతున్న కొత్త షో పెళ్లిచూపులు రియాలిటీ షో కాన్సెప్ట్ గురించి కూడా ప్రదీప్ ప్రస్థావించడం జరిగింది. ఫైనల్ గా ప్రదీప్ వచ్చాడు. సినిమా చూపించాడు.. అందరి ఫ్యామిలీస్ మెమొరీస్ ను తెచ్చిపెట్టాడు. వెళ్లిపోయాడు. వైల్డ్ కార్డ్ గా ప్రదీప్ వస్తే ఎలా ఉండేదో కాని గెస్ట్ గా మాత్రం వచ్చిన ఉన్న రెండు ఎపిసోడ్స్ బాగా వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: