మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు అల్లు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా అల్లు శిరీష్ ఇండస్ట్రీలో హీరోగా రాణించలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో తనకు కోలీవుడ్ లో అయినా అదృష్టం కలిసి వస్తుందేమో అని చేసిన ప్రయత్నాలు రివర్స్ కావడం ఈహీరోకు షాకింగ్ న్యూస్ గా మారింది. 
Allu Sirish, Allu Sirish Films, Allu Sirish Next Film, Allu Sirish Upcoming Film, Allu Sirish New film, Allu Sirish New Movie, Allu Sirish Latest Film, Allu Sirish Movies, Entertainment news
సూర్యాతో కలిసి తాను ఒక మల్టీ స్టారర్ చేస్తున్నట్లుగా శిరీష్ ఆసినిమా ప్రారంభం కాకుండానే అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ హడావిడి చేసాడు. అయితే ఇప్పుడు ఆసినిమాలో శిరీష్ ను తొలగించి ఆర్యను పెట్టుకున్న విషయం పై శిరీష్ ఇచ్చిన వివరణ చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. 
Actor Allu Sirish
తాను సూర్యాతో నటించాలి అనుకున్న ‘ఎబిసిడి’ మూవీకి డేట్స్ సమస్య రావడంతో తాను ఆమూవీ నుండి తప్పుకున్నానని ప్రస్తుతం తాను నటిస్తున్న రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ సద్దుబాటు చేయడంలో సమస్యలు రావడంతో తాను సూర్యా మూవీని వదులుకున్నాను అంటూ శిరీష్ మీడియాకు లీకులు ఇవ్వడం సంచలనంగా మారింది. అంతేకాదు తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కెవి. ఆనంద్ కు అదేవిధంగా హీరో సూర్యకు కృతజ్ఞతలు తెలియచేస్తూ తన మీడియా లీక్ ను ముగించాడు. 
allu
అయితే వాస్తవానికి ఈమూవీ ప్రాజెక్ట్ నుండి శిరీష్ తప్పుకోలేదని అతడిని తప్పించారు అంటూ వార్తల హడావిడి చేస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ కోసం ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయిన నేపధ్యంలో శిరీష్ ను ఈమూవీ నుండి పది రోజుల క్రితమే తప్పించేసారు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఇలాంటి విషయాల పై మౌనంగా ఉండకుండా కావాలని అందరికీ తెలిసేలా మీడియాకు లీకులు ఇస్తూ రచ్చ చేసుకోవడం ఎందుకు అంటూ కొందరు శిరీష్ అత్యుత్సాహం పై సెటైర్లు వేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: