మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో విజేతగా వచ్చాడు. మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాన్ దేవ్ హీరోగా రాకేష్ శషి డైరక్షన్ లో విజేత వచ్చింది. ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ చేయబోతున్న సినిమా హరీష్ శంకర్ డైరక్షన్ లో ఉంటుందని టాక్.


డిజే తర్వాత దాగుడుమూతలు సినిమా ప్లాన్ చేసిన హరీష్ శంకర్ దిల్ రాజు ఆ సినిమా ప్రొడ్యూస్ చేయనని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కించాడు. ఇక కళ్యాణ్ దేవ్ తో సినిమా అంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదని చెప్పాడు హరీష్ శంకర్. విజేతతో హీరోగా మెప్పించిన కళ్యాణ్ దేవ్ సెకండ్ మూవీపై ఇప్పటినుండే డిస్కషన్స్ మొదలయ్యాయి.


ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో తర్వాత మూవీపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దాగుడుమూతలు సబ్జెక్ట్ నే ఏ.కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. మరి కళ్యాణ్ కు సరితూగే కథ లేదని అతన్ని వద్దన్నాడా లేక అతని యాక్టింగ్ నచ్చక కాదన్నాడా అన్నది తెలియాల్సి ఉంది.


మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను సాయి చంద్ర డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది. రాం తాళ్లూరి ఈ సినిమా నిర్మించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మెగా హీరోలంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: