తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డితో మంచి ఫామ్ లోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ.  ఈ చిత్రం హిట్ అయిన తర్వాత మనోడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి.  అయితే విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాల చిత్రం రిలీజ్ కావాల్సి ఉన్నా కాస్త ఆలసయ్యం అవుతుంది. ఈ మద్య కాలంలో మ్యూజిక్, ఫైట్ సీన్లు, సాంగ్స్ ఇలా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కాపీ చేస్తూ తమ చిత్రాల్లో పెట్టుకోవడం అది కాస్త హైలెట్ కావడంతో ఒరిజినల్స్ లబో దిబో అనడం జరుగుతుంది. 

Image result for geeta govindam

 తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘గీతాగోవిందం’ చిత్రానికి ఇదే చిక్కొచ్చి పడింది.  అసలు విషయానికి వస్తే..నివాస్ చాలా రోజుల నుండి డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నాడట.  అతడు అప్పుడెప్పుడో 'వర్జిన్' అనే పేరుతో ఒక కథ రాసి ఆ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట.  ఆ 'వర్జిన్' కి హీరో గా కమెడియన్ జోగి నాయుడుని అనుకున్నాడట.   అప్పట్లో కొన్ని ఇబ్బందుల వల్ల ఆ ప్రాజెక్ట్ కుదరలేదట.
Image result for geeta govindam
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘వర్జిన్’ అనే కాన్సెప్ట్ తో రావడం పై రగడ మొదలైంది. . నేను వర్జిన్ అంటూ ఉండే సరికి ఆ నివాస్ ఈ సినిమాపై కంప్లైంట్ చేయడం జరిగిందట.  ఈ 'వర్జిన్' టెస్టును విజయ్ దేవరకొండ అయన టీమ్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.  ఇలాంటి టెస్టులే అసలు సినిమాలో నిజంగా విషయం ఉందా.. ఒరిజినల్ స్టఫ్ఫేనా కాదా అనే సంగతి అందరికీ  తెలిసేలా చేస్తాయి.    ఇవన్నీ తెలియాలీ అంటే ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: