ఓ వైపు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని..అలాంటి అనుభవాలు మేం ప్రత్యక్షంగా అనుభవించామని కొంత మంది హీరోయిన్లు ఆరోపిస్తున్నారు.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి పెద్ద ఉద్యమం కొనసాగించింది.  అంతే కాదు అందుకు తానే సాక్ష్యం అని..తనను ఎంతో మంది నమ్మించి మోసగించారని కొంత మంది సెలబ్రెటీల ఫోటోలు కూడా లీక్ చేసింది.  కాస్టింగ్ కౌచ్ పై తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు బాహిరంగంగానే చెప్పారు. 

Image result for కాస్టింగ్ కౌచ్ కాజల్

  సినిమా ఛాన్స్ లు అంటూ ఎంతో మంది యువతుల జీవితాలతో దళారులు ఆడుకుంటున్నారని..వారిని శారీరకంగా వాడుకుంటున్నారని అయినా ఛాన్స్ లు వస్తాయో రావో అన్న పరిస్థితుల్లో ఉంటున్నారని ఆరోపిస్తున్నారు.    తాజగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు కాస్టింగ్ కౌచ్ కు సంబందించిన ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది.  తన అదృష్టం కొద్దీ అలాంటి చేదు అనుభవాలు నాకు ఎదురు కాలేదు. 

Kajal reacts on casting couch issue

అసలు కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉందొ లేదో కూడా తెలియదు అని కాజల్ వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పడం కంటే మగాళ్లకు ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి అని కాజల్ అగర్వాల్ బదులిచ్చింది.  ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కాస్టింగ్ కౌచ్ వలన తనకెలాంటి ఇబ్బందీ కలగలేదని, పరిశ్రమలో అందరూ  చెడ్డవాళ్లే ఉండరని కొంత క్లారిటీ  ఇచ్చింది.  తాజాగా కాజల్ అగర్వాల్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: