లవర్ బోయ్ నితిన్ కెరియర్ లో హిట్లు ఫ్లాపులు సమతూకంతో సినిమాలు చేస్తున్నాడు. 14 సినిమాల తర్వాత మళ్లీ ఇష్క్ తో హిట్ అందుకున్న నితిన్ ఒక హిట్ రెండు ఫ్లాపులతో కైయర్ కొనసాగిస్తున్నాడు. అఆ తర్వాత లై, ఛల్ మోహన్ రంగ ఫ్లాపయ్యాయి. ప్రస్తుతం శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు నితిన్.  


దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస కళ్యాణం టైటిల్ పెట్టారు. పెళ్లి ప్రాధాన్యత గురించి చెప్పే సినిమాగా శ్రీనివాస కళ్యాణ్ రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ ఇటీవల ఆరెక్స్ 100 తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.


ఆరెక్స్ 100 ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్ హిట్ అందుకున్న అజయ్ నితిన్ తో చేసే సినిమా కూడా అదే విధంగా రొమాంటిక్ టచ్ తో ఉంటుందని అంటున్నారు. నితిన్ కెరియర్ లో ఎప్పుడు లేని క్రేజీ రొమాన్స్ చేయబోయే సినిమాలో ఉండబోతుందట.  


శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. శ్రీనివాస కళ్యాణం ఎలాగు సేఫ్ ప్రాజెక్ట్ అవడంతో నితిన్ బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. యువ హీరోలంతా క్రేజీ సినిమాలతో దూసుకెళ్లిపోతుంటే నితిన్ వారిని బీట్ చేసే అద్భుతమైన ప్లాన్ వేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: