బిగ్ బాస్ సీజన్ 2 నాని సరదాగా అనిపిస్తూనే కంటెస్టంట్స్ మీద మాటలతో తన రియాక్షన్స్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా కామన్ మెన్ గా వచ్చిన గణేష్ గురించి లాస్ట్ వీక్ ఇంటి సభ్యులందరికి క్లాస్ తీసుకున్న నాని ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ లో గణేష్ ను గట్టిగానే వాయించినట్టు ఉన్నాడు.


రీసెంట్ గా నామినేషన్ టాస్క్ లో భాగంగా అమిత్ కు ఇచ్చిన సీక్రెట్ టాస్ లో గణేష్ కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యాడని అనిపించింది. టాస్క్ లో భాగంగానే అమిత్ గుడ్డుతో కొట్టగా దాన్ని పెద్ద సీన్ చేశాడు గణేష్. గణేష్ ఓవరాక్షన్ కు నాని రియాక్షన్ అదిరిపోయింది. యుద్ధంలో సైనికుడితో పోల్చుతూ గుడ్డు కొట్టించుకోవడం గురించి మాట్లాడాడు.  


అయితే తనని గుడ్డుతో కొట్టిన సందర్భంలో నేను ఉండటం ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్లిపోతా అని గణేష్ నోరు జారాడు. దాని మీదే నాని ఫోకస్ పెట్టాడు. ఎలాగోలా 10 సెకన్లు మెయిన్ డోర్ ఓపెన్ చేయిస్తా ఇంటి నుండి బయటకు వచ్చేస్తావా అంటూ గణేష్ ను అడుగుతాడు నాని.


సో అలా గణేష్ తో నాని సరదా సంభాషణ సాగుతుంది. మొత్తానికి ఎప్పటిలానే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది మళ్లీ సస్పెన్స్ లోనే పెట్టేశాడు నాని. అయితే తేజు, సామ్రాట్ లలో ఒకరు ఎలిమినేట్ అవబోతున్నారు మిగతా వారంతా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: