థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డ‌.. అంటూ త‌న‌దైన కామెడీ మేన‌రిజ‌మ్‌, టైమింగ్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ క‌మెడియ‌న్ పృథ్వీ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం `మై డియ‌ర్ మార్తాండం`. మేజిన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌రీష్‌ కె.వి. ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు.  ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.  కాగా, టాలీవుడ్ లో  ఈ మద్య కమెడియన్లు హీరోలుగా మారుతున్న విషయం తెలిసిందే.  బ్రహ్మానందం, ఆలీ తర్వాత ఇప్పుడు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి రీసెంట్ గా షకలక శంకర్ కూడా హీరోగా నటించాడు.   
Marthanda
తాజాగా ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్విరాజ్ హీరోగా మారారు.   లాయర్ అవతారంలో క్లయింట్లను.. తోటి లాయర్లను.. చివరకి జడ్జిని కూడా వదలకుండా ముప్పతిప్పలు పెడుతున్నట్టుగా 'మార్తాండం' పాత్రను చూపించారు.  టీజర్  చివర్లో '30 రోజులలో లాయర్ కావడం ఎలా' అనే పుస్తకాన్ని శ్రద్ధగా చదువుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు.  చూస్తుంటే కొత్త దర్శకుడు హరీష్ రైట్ ట్రాక్ లో పృథ్వి కామెడీ టైమింగ్ ని ఫుల్లుగా వాడుకున్నట్టుగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా  పృథ్వీ మాట్లాడుతూ “దర్శకుడు హరీశ్ పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా సినిమా చేశాం. ఇందులో లాయర్ పాత్రలో నటించాను. అమాయకుడిగా ఉండే తెలివైన పాత్ర నాది”అని అన్నారు

 డైరెక్ట‌ర్ హ‌రీశ్ కె.వి మాట్లాడుతూ – మాది కోర్టు రూం క్రైమ్ కామెడీ. అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశామంటే అంద‌రి స‌హ‌కార‌మే కార‌ణం. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అన్నారు. పృథ్వీ, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, కృష్ణ భ‌గ‌వాన్‌, రాకేందు మౌళి, గోకుల్‌, క‌ల్పిక గ‌ణేశ్‌, క‌ల్యాణ్ విట్ట‌పు, తాగుబోతు ర‌మేశ్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ప‌్ర‌వీణ్‌, మ్యూజిక్‌: ప‌వ‌న్‌, ఎడిటింగ్‌: గ‌్యారీ బి.హెచ్‌, సినిమాటోగ్ర‌ఫీ:ర‌్యాండీ, నిర్మాత‌: స‌య్య‌ద్ నిజాముద్దీన్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రీష్‌ కె.వి.


మరింత సమాచారం తెలుసుకోండి: