మల్టీ ఫ్లెక్స్ లో ఎక్కువ రేట్లకు తిను బండారాలు డ్రింక్స్ అమ్ముతున్నారని, మరియు బయటి ఫుడ్ థియేటర్ లోకి అనుమతి ఇవ్వడం లేదని ప్రజలు నుంచి ఎక్కువ సంఖ్యలో పిర్యాదులు వెళుతున్నాయి. అయితే ఇదే విషయం మీద మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి థియేటర్ యాజమాన్యాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా బయటి నుంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోని వెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. 

Image result for suresh babu

అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఆవిధముగా చర్యలు జరగడం లేదు. ఎందుకంటే థియేటర్లను శాసించేవారిలో చాలామంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులే. అందుకే వారిని ఇరుకునపెట్టే పని ప్రభుత్వం చేయదు. తెలంగాణలో పార్కింగ్ చార్జీలు ఎత్తివేసినా ఆంధ్ర ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మహరాష్ట్ర మాదిరిగా తినుబండారాల ధరలపై దృష్టి సారిస్తోంది. దీంతో తెలంగాణలో దాదాపు 90శాతం థియేటర్లను చేతిలో వుంచుకున్న వాళ్లకు సమస్య మొదలైంది.

Image result for suresh babu

ముఖ్యంగా దగ్గుబాటి సురేష్, ఆసియన్ సునీల్ లాంటివాళ్లు ఇప్పుడు ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి రెడీ అయిపోయారు. అర్జెంట్ గా ఆఘమేఘాల మీద ఫిల్మ్ చాంబర్ లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యిజమానులు ఇలా అందరితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.బహుశా పార్కింగ్ చార్జీలు, తినుబండారాల ఆదాయం అంతా నష్టపోతున్నందున, రెంట్లు, పెంచుతామని ఎగ్జిబిటర్లు కోరే అవకాశం వుంది. ఆ విధంగా నిర్మాతల మీద, పంపిణీదారుల మీద ఈ సమస్య బాధ్యత పడేస్తారు. అప్పుడు అది టాలీవుడ్ సమస్యగా మారి, ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాన్ని అమలుకాకుండా ఆపే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: