బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా మెగా నందమూరి సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో సమంత కూడా ఉండబోతుందని టాక్.


రాజమౌళి ఆఫర్ ను సమంత సున్నితంగా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. రాజమౌళి ఈగతోనే యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సమంత బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా ఆఫర్ కాదనడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై సమంత క్లారిటీ ఇచ్చేసింది.


అసలు సమంతకు రాజమౌళి నుండి ఏమాత్రం ఆఫర్ రాలేదట. మెగా నందమూరి కాంబినేషన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి నటించబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. పిరియాడికల్ మూవీపై రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, పూజా హెగ్దె నటిస్తున్నారట.


పెళ్లి తర్వాత సమంత సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. ప్రస్తుతం యూటర్న్ సినిమా చేస్తున్న సమంత తెలుగులో  చైతు సరసన ఓ సినిమా కమిట్ అయ్యింది. తమిళంలో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తుంది. మొత్తానికి మల్టీస్టారర్ లో సమంత ఛాన్స్ గురించి క్లారిటీ ఇచ్చింది సమంత.   



మరింత సమాచారం తెలుసుకోండి: