ఈరోజు బిగ్ బాస్ హౌజ్ నుండి ఎవరు బయటకు వస్తారన్న దాని మీద లీకులు సెన్సేషన్ గా మారాయి. ఆల్రెడీ శ్యామలా, భాను శ్రీల ఎలిమినేషన్స్ ముందే లీక్ అయ్యాయి. ఇక ఇదే దారిలో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దాని మీద కూడా వార్తలు బయటకు వచ్చాయి.


బిగ్ బాస్ లో పనిచేస్తున్న వారే లీకులు బయటకు పంపిస్తున్నారు. లీకైన గ్రాఫ్ లెక్కల ప్రకారంగా సామ్రాట్ ఈ వారం ఎలిమినేషన్ కావాల్సి ఉంది. అయితే లేటేస్ట్ గా తేజశ్వి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. హౌజ్ నుండి బయటకు వచ్చాక తేజశ్వి దిగిన సెల్ఫీ ఈ సీక్రెట్ బయటపెట్టేసింది. 


ఈరోజు షోలో సస్పెన్స్ రివీల్ అవ్వాల్సిన ఈ ఎలిమినేషన్ ఇలా ముందే తెలియడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. బిగ్ బాస్ లీకుల వల్ల షో మీద ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. ఈ లీకుల వల్ల నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. బిగ్ బాస్ టి.ఆర్.పి రేటింగ్ మీద కూడా ఈ లీకుల ప్రభావం పడుతుంది.  


నిన్న ఎపిసోడ్ లో సామ్రాట్, తేజశ్విలు మాత్రమే ఎలిమినేషన్ జోన్ లో ఉంచాడు నాని. ఈ ఇద్దరిలో నిన్నటిదాకా సామ్రాట్ ఎలిమినేట్ అని వార్తలు రాగా ఫైనల్ గా తేజశ్వి బయటకు వచ్చి దిగిన సెల్ఫీ సంచలనం సృష్టిస్తుంది.  మరి ఈ లీకుల పర్వం ఎలా ఆపగలుగుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: