యాంకర్ ఝాన్సీ తాను నిర్వహించే ఫిలిం ఫంక్షన్స్ లో ఒకొక్కసారి అత్యుత్సాహంతో కామెంట్స్ చేస్తూ ఆకార్యక్రమంలో పాల్గొన్న సెలెబ్రెటీలను అనుకోకుండా ఇరుకున పెట్టిన సందర్భాలు చాల ఉన్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడ అలాంటి సందర్భమే యాంకర్ ఝాన్సీ వల్ల మెగా డాటర్ నిహారికకు ఎదురైంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ఇక వివరాలలోకి వెళితే ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ లో నిహారిక చెప్పిన డైలాగ్ ‘పెళ్లి కన్ఫర్మ్ అయ్యే వరకు ఒకలాగా పెళ్లి అనుకోగానే ఒక లాగా మారిపోతావా' అంటూ నిహారిక సుమంత్ అశ్విన్ తో అన్న డైలాగ్ ను ఆధారంగా చేసుకుని ఇలాంటి సంఘటన నిజ జీవితంలో ఎప్పుడైనా ఎదురైందా అంటూ యాంకర్ ఝాన్సీ నిహారికను ప్రశ్నించింది. అనుకోని ఈ ప్రశ్నకు షాక్ అయిన నిహారిక ఈ ప్రశ్న తన వ్యక్తిగత జీవితం పై వస్తున్న రూమర్లకు సంబంధించిందిగా భావించి కొద్దిసేపు షాక్ అయి ఆషాక్ నుండి తేరుకుని మరో విధంగా సమాధానం ఇచ్చింది. 

‘అబ్బాయిలే కాదు ప్రతి రిలేషన్ షిప్ లోనూ ఫ్రెండ్స్ అయినపుడు ఇద్దరమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు మొదట్లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. తర్వాత బోర్ కొడతారు కదా’ అంటూ నిహారిక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. అయితే అనాలోచితంగా తాను అడిగిన ప్రశ్న నిహారికకు కోపం తెప్పించింది అని గ్రహించిన యాంకర్ ఝాన్సీ ఆకార్యక్రమం అయిపోయిన తరువాత బయటకు వెళ్ళిపోతున్న నిహారిక నాగాబాబులను కలిసి ‘సారీ’ చెప్పినా వారిద్దరూ ఝాన్సీ వంక చూడకుండా బయటకు వెళ్ళిపోయినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈమూవీ ట్రైలర్ లో నిహారిక  ఓడ్కా త్రాగినట్లుగా నటించడం చూసిన వారు నిజంగా నిహారిక ఓడ్కా తాగిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో నిహారిక నటించిన ఈ సీన్ కోసం యూత్ ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చూడటానికి ధియేటర్స్ కు బాగా వచ్చే ఛాన్స్ ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: