మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణకు చిన్నప్పటి నుంచి మంచి క్రేజ్ ఉంది.’వన్’ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ నటించిన పాత్రకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డ్ కూడ వచ్చింది. అయితే ఆతరువాత ఈ జూనియర్ మహేష్ కు చాల అవకాశాలు వచ్చినా ఆ అవకాశాల విషయంలో మహేష్ పెద్దగా స్పందించక పోవడంతో గౌతమ్ ను మళ్ళీ వెండితెర పై చూడాలి అన్న అభిమానుల కోరిక తీరని కోరికగా అలాగే కొనసాగుతోంది.

ఇది ఇలా ఉండగా మహేష్ తో ‘దూకుడు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల గౌతమ్ కు ఇచ్చిన ఒక పెద్ద ఆఫర్ ను మహేష్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస పరాజయాల బాటలో ఉన్న శ్రీనువైట్ల రవితేజాను నమ్ముకుని ‘అమర్ అక్బర్ ఆంథోని’ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. 
Sreenu Vaitla,Amar Akbar Anthony,Ravi Teja
ఈమూవీకి సంబంధించి ఒక కీలక ఎపిసోడ్ షూటింగ్ త్వరలో అమెరికాలో జరగబోతున్నట్లు టాక్. ఈ ఎపిసోడ్ లో రవితేజ చిన్ననాటి పాత్రను చేయడానికి గౌతమ్ కృష్ణను ఎంపిక చేయాలని మహేష్ పై శ్రీనువైట్ల తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈమూవీలో కీలకమైన ఈ చైల్డ్ హుడ్ క్యారెక్టర్ గౌతమ్ చేయడానికి ఒప్పుకుంటే భారీ పారితోషికం ఇస్తాను అని కూడ ఈమూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ నిర్మాతల చేత ఆఫర్ చేయించినట్లు టాక్. 
CPI advises KCR and Chandrababu to watch Mahesh Babu latest film
గౌతమ్ ప్రస్తుతం సీరియస్ గా చదువుకుంటున్నాడని ఇప్పుడు మళ్ళీ సినిమా వాసన అతడికి అంటించడం తనకు ఇష్టం లేదు అంటూ శ్రీనువైట్లతో మహేష్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీనువైట్ల దర్శకత్వంలో తన కొడుకు గౌతమ్ నటించడం ఇష్టంలేక ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడా లేదంటే నిజంగానే గౌతమ్ చదువు కారణమా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: