తెలుగు ఇండస్ట్రీలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలు వచ్చాయి. ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్ అంటే థియేటర్లో నవ్వుల జల్లులు వెల్లివిరిసేయనే చెప్పాలి.   అప్పట్లో సుత్తి జంట సుత్తివీరభద్రారావు, సుత్తివెలు కనిపిస్తే కామెడీ హైలెట్ ఉండేది..ఆ తర్వాత కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్ ఈ జోడీ కనిపిస్తే థియేటర్లో పడీ పడీ నవ్వేవారు.  ప్రస్తుతం బాబు మోహన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 
 Image result for babu mohan kota srinivasa rao
 తాజాగా బాబుమోహన్ కీలక పాత్రలో ‘బిచ్చగాడా మజాకా’అనే సినిమా రెడీ అయింది.   చాలా కాలం తర్వాత ఆయన ముఖానికి రంగు వేసుకుంటున్నారు.    2 దశాబ్దాల కిందట బాబుమోహన్ నుంచి ఎలాంటి కామెడీ చూశామో, దాదాపు అదే కామెడీని యాజ్ ఇటీజ్ గా చూడొచ్చంటున్నారు మేకర్స్. బిచ్చగాడి గెటప్ లో బాబుమోహన్ తో కామెడీ చేయించడంతో పాటు అతడితో పాటకు చిందులు కూడా వేయించారు. స్వయంగా ఓ పాటను బాబుమోహన్ పాడారు కూడా. 
Image result for babu mohan kota srinivasa rao
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో బాబు మోహన్ పోటీలో ఉండటం లేదా..ఎందుకంటే రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి రాష్ట్ర నేతల హడావుడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో నేతలంతా ఎన్నికలపై ఫోకస్ పెడుతూ నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న వేళ.. ఈ ఎమ్మెల్యే ఇలా సినిమా చేయడం చర్చనీయాంశమైంది.   ఏది ఏమైనా బాబు మోహన్ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: