దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న జూనియర్ ‘అరవింద సమేత’ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ షూటింగ్ స్పాట్ నుండి ఒక ఫోటో లీక్ అయింది. ఈ ఫోటోలో జూనియర్ మరియు నాగబాబులు గాయాలపాలు అవ్వడంతో జూనియర్ టెన్షన్ పడుతూ నాగబాబు తన కారులో తీసుకువెళ్ళుతున్న సీన్ కు సంబంధించిన ఫోటో అది.
స్టిల్ లీక్
ఇప్పుడు ఈఫోటో లీక్ అయిన కొద్ది గంటలలోనే సోషల్ మీడియాలో భీభత్సం సృష్టిస్తూ జూనియర్ అభిమానుల మధ్య ఈఫోటో హాట్ టాపిక్ గా మారింది. ఈఫోటో ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గాయాలతో ఉన్న నాగబాబుని వాహనంలో తీసుకుని వెళుతున్న ఎన్టీఆర్ ఎమోషనల్ గా కనిపిస్తున్న ఈ ఫోటోను చూసి జూనియర్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతూ ఈమూవీ 100 కోట్ల మూవీ అవ్వడం ఖాయం అని కామెంట్స్ పెడుతున్నారు. 
ఫ్యాక్షన్ నేపథ్యంలో
ఈమూవీలో నాగబాబు ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నది కూడా నాగబాబు అన్న ప్రచారం జరుగుతోంది. ‘అజ్ఞాతవాసి’ షాక్ తో తన తీరుకు భిన్నంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమూవీని అత్యంత వేగంగా పూర్తి చేస్తూ ఉండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తి వేస్తోంది.  
 దసరా కానుకగా
ఇప్పటికే ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న నేపధ్యంలో బయ్యర్లలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి వ్యూహాత్మకంగా ఈమూవీ యూనిట్ కావాలనే ఇలా ఫోటోల లీకులు ఇస్తోంది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈమూవీకి హిట్ టాక్ వస్తే కేవలం రెండు వారాలలో 100 కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: