టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన మహేష్ సూపర్ స్టార్ గా అవతరించాడు. తండ్రి వారసత్వాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న మన మహేష్ ఇప్పుడు సౌత్ లో ఓ సెన్సేషనల్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ నెంబర్ 1 రేసులో ముందున్న మహేష్ ఇప్పుడు సౌత్ లో నెంబర్ 1 గా దూసుకెళ్తున్నాడు.


అదేంటి తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో మిగతా వారంతా మహేష్ తర్వాతేనా అనుకోవచ్చు. అవును తర్వాతే అది ఎందులో అంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ లో అని తెలుస్తుంది. మహేష్ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలలో మొత్తం 13 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 


ట్విట్టర్ లో 6.6, ఫేస్ బుక్ లో 5.1, ఇన్ స్టాగ్రాంలో 1.4 ఇలా మూడిట్లో కలిగి 13 మిలియన్స్ ఫ్యాన్స్ మహేష్ ను ఫాలో అవుతున్నారు. ఇది కచ్చితంగా మహేష్ క్రేజ్ కు నిదర్శనమని చెప్పొచ్చు. సూపర్ స్టార్ సెన్సేషనల్ రికార్డ్ అది కూడా ఫ్యాన్స్ వల్ల మహేష్ సౌత్ లో నెంబర్ 1 హీరో అయ్యాడు.


ఇక సినిమాల గురించి తెలుసుకుంటే.. భరత్ అనే నేను తర్వాత మహేష్ తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రాజసం టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ మూవీలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. పూజా హగ్దె ఈ సినిమా హీరోయిన్ గా నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: