అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ లో ఏ రేంజ్ లో పెరిగిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత టాక్సీ వాలా అంటూ ఓ మూవీ చేసినా అది రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా గీతా గోవిందం అంటూ విజయ్ మరో క్రేజీ మూవీతో వస్తున్నాడు.


గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. విజయ్ సరసన కన్నడ కిరాక్ పార్టీ భామ రష్మిక హీరోయిన్ గా నటించింది. అమ్మడు తెలుగులో చేసిన మొదటి సినిమా ఛలో కూడా సూపర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.


ఇక సినిమాలో విజయ్, రష్మికల పెయిర్ అదిరిపోయింది. అమ్మాయిల వెంట పడే ప్లే బాయ్ గా విజయ్.. అతని గురించి తెలిసి అతను మేడం మేడం అని ఎంత వెంట పడినా పట్టించుకోని హీరోయిన్ గా రష్మిక ఇద్దరు సమ ఉజ్జీలుగా నటించారు. యూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాను కూడా మరో అర్జున్ రెడ్డి రేంజ్ లో హిట్ అందుకుంటాడని చెప్పొచ్చు.


పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్యనే కెరియర్ లో మొదటి ఫిల్మ్ ఫేర్ వచ్చినా దాన్ని ఆక్షన్ లో పెట్టి సిఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ అందించిన విజయ్ రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ హీరోగా కూడా మార్కులు కొట్టేశాడు. మరి ఈ గీతా గోవిందం అతని కెరియర్ లో ఎలాంటి మూవీగ నిలుస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: