వివాదాలకు దూరంగా ఉంటూ అందరి హీరోలకు సన్నిహితంగా ఉండే దిల్ రాజ్ ఈమధ్య హీరోలను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ ఎవరికీ అర్ధం కాని విషయంగా మారాయి. ఈమధ్యకాలంలో తాను  తీస్తున్న సినిమాలు  చాలమటుకు విజయాలు సాధిస్తున్న నేపధ్యంలో  తను ఏం మాట్లాడినా చెల్లుతుందని దిల్ రాజ్ అభిప్రయాపడుతున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
hero nithiin speech at srinivasa kalyanam audio launch
ఎప్పడు అందరితో నవ్వుతూ ఉండే దిల్ రాజ్ తన వ్యూహం మార్చి స్టేజ్ పైనే హీరోల గురించి కామెంట్స్ చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం రాజ్ తరుణ్ ‘లవర్’ సినిమా విడుదలకు ముందు ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ మార్కెట్ పై అతడి సినిమాల పరాజయాల పై కామెంట్స్ చేసిన విషయం  తెలిసిందే. ఈసంఘటన జరిగి కొన్నిరోజులు గడవకుండానే దిల్ రాజ్ కామెంట్స్ చేసే హీరోల లిస్టులో నితిన్ కూడ చేరాడు. 
nithin srinivasa kalyanam movie release date locked!
నిన్న జరిగిన ‘శ్రీనివాసకల్యాణం’ ఆడియో ఫంక్షన్ లో దిల్ రాజ్ మాట్లాడుతూ నితిన్ తన ఇంటికి వచ్చి సినిమా ఛాన్స్ కోసం అడిగిన విషయాన్ని బయటపెట్టాడు. దిల్ సినిమా తరువాత నితిన్ తో ఎన్నో సినిమాలు అనుకున్నా అవి కుదరలేదు అని అంటూ ఆ మధ్య నితిన్ వరస ఫ్లాపుల్లోఉన్న నేపధ్యంలో ఒకరోజు నితిన్ తన ఇంటికి వచ్చి ‘అంకుల్ నాకో సినిమా కావాలని కోరాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
Srinivasa Kalyanam Movie Release In August
ఈకామెంట్స్ బహిరంగంగా దిల్ రాజ్ నోటి వెంట రావడంతో నిన్నటి కార్యక్రమంలో దిల్ రాజ్ పక్కనే ఉన్న నితిన్ కొద్దిసేపు షాక్ కి గురి కావడం అందరికీ స్పష్టం గా కనిపించింది.  టాప్ యంగ్ హీరోల నుండి రాజ్ తరుణ్ వరకు ఎందరో హీరోలతో సినిమాలు తీస్తున్న దిల్ రాజ్ హీరోలకు ఎవరికైనా సాధారణంగా ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఫ్లాపుల గురించి ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నాడు అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగు తున్నాయి. అయితే నిన్నటి ఫంక్షన్ లో నితిన్ పై కామెంట్ చేసిన దిల్ రాజ్ తన పొరపాటు వెంటనే గ్రహించి ‘శ్రీనివాసకల్యాణం’ లాంటి సినిమా చేయడంకోసమే నితిన్ తో  ఇన్నేళ్ల గ్యాప్ వచ్చినట్టుందని కవరుచేయడం నిన్నటి కార్యక్రమంలోని కొసమెరుపు. ఏదిఏమైనా దిల్ రాజ్ తీరును చూసినవారు ఈభారీ నిర్మాతకు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: