తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో రెండు దశాబ్దాలపాటు సంచలన రేపిన షకీలా ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం షకీలా జీవితంలోని సంఘటన ఆధారంగా చేసుకొని ఓ బయోపిక్‌ను దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల దిన పత్రికలో నటి రిచా చద్దాతో మాట్లాడుతూ తన జీవితంతో కొన్ని ఛేదు అనుభవాలు పంచుకున్నారు.  ఇప్పుడు సినిమా పరిశ్రమకు, మీడియాకు దూరంగా ఉండటంలో నాకు ఎలాంటి బాధలేదు.
హిందీ సినిమాలో ఆఫర్లు
ప్రస్తుతం నా పరిధిలో ఉన్న జీవితాన్ని, సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. ఖాళీ సమయాల్లో కంప్యూటర్ గేమ్స్ ఆడుకొంటాను. మొబైల్‌లో గేమ్స్ ఆడుకొంటాను. లేదంటే హాలీవుడ్ సినిమాలు చూస్తాను. ఇప్పుడు నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా అనుభవిస్తున్నాను. తన 20 ఏళ్ల కెరీర్‌లో హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ నేను అంగీకరించలేదు. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో అవకాశం వచ్చింది.
Image result for chennai express movie
కానీ ఆ సినిమా కోసం నన్ను అడిగిన పద్దతి నచ్చలేదు..చాలా భాద అనిపించింది. చిత్ర యూనిట్ ఏకంగా నా ఇంటికి వచ్చి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో సత్యరాజ్ పక్కన నటించమని నన్ను అడిగారు. కానీ రోజుకు రూ.20 వేలు మాత్రమే ఇస్తాం. ఆడిషన్‌కు రావాలని ఏకంగా సత్యరాజ్ ముందే చెప్పడం నాకు తలకొట్టేసినంత పనైంది.
Image result for kamal hassan
ఏమిటి నా విలువ రూ.20 వేల విలువకట్టడం చాలా బాధేసింది. అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ నాకు 20 వేలు ఇస్తానని చెప్పడం నాకు నచ్చలేదు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటి ఛేదు అనుభవం నాకు ఎదురు కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  ఇక తన ఇష్టమైన హీరో కమల్ హాసన్ అని..తనతో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: