తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బ్యాచ్ లర్ హీరోలు ఎవరూ అంటే ప్రభాస్, నితిన్, రానా ఇలా కొంత మంది ఉన్నారు.  అయితే ప్రభాస్ పెళ్లి విషయంలో ఎన్నో రూమర్లు వస్తున్నాయి..కానీ అవన్నీ కొట్టి పడేస్తున్నారు..ప్రభాస్ ఫ్యామిలీ.  పెళ్లి ప్రస్తావన తెచ్చినపుడల్లా ప్రభాస్ ఏదో ఒక విషయం చెప్పి దాటేస్తున్నారు.  ఇక రానా విషయానికి వస్తే కూడా ఇదే పద్దతి.  తాజాగా ఇప్పుడు అందరి దృష్టి హీరో నితిన్ పై పడింది.  మనోడు ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది.  కానీ ఇప్పటి వరకు పెళ్లి ఊసే తీసుకు రాలేదు. 

తన తోటి హీరోలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి..పిల్లలు కూడా పుట్టారు.  తాజాగా నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన 'శ్రీనివాస కల్యాణం' రిలీజ్ కి సిద్దంగా ఉంది.  ఈ చిత్రం ఆడియో వేడుక సందర్భంగా కొన్ని సంచలన నిజాలు తెలిపారు నితిన్. తన తల్లి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుండగా, ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు ఇప్పుడే పెళ్లి ఉద్దేశం లేదని చెబుతూ వచ్చానని, కానీ, సతీష్ వేగేశ్న చెప్పిన 'శ్రీనివాస కల్యాణం' కథ వినగానే పెళ్లి చేసుకోవాలన్నంత అనుభూతి వచ్చిందని హీరో నితిన్ వ్యాఖ్యానించాడు.

ఈ చిత్ర  "కథ విన్నాక పెళ్లి చేసుకోవాలనిపించింది. కానీ.. సెట్లో పూజలు, వ్రతాలు చూసి పెళ్లి అంటే ఇంత కష్టమా? అనిపించింది. కానీ పెళ్లి మాత్రం చేసుకొంటా. అమ్మా... ఒట్టు! పెళ్లి చేసుకుంటా" అని అన్నాడు. దీంతో ఆహూతులంతా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: