తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకరు క్రిష్.  వేదం చిత్రంతో తన ప్రస్ధానం మొదలు పెట్టిన క్రిష్ ఆ తర్వాత విభిన్న కథా చిత్రాలతో తెలుగు తెరపై తన సత్తా ఏంటో చూపిస్తున్నారు.  అయితే రెగ్యూలర్ చిత్రాలకు విభిన్నంగా  మెగా హీరో వరుణ్ తేజ్ తో 1945 నాటి కథతో అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించిన క్రిష్ తర్వాత బాలకృష్ణ తో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లాంటి చారిత్రాత్మక సినిమాతో అందరినీ ఆకర్శించారు.  ప్రస్తుతం క్రిష్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. 
Image result for ntr biopic
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని ఎన్నో రకాలుగా చూపించబోతున్నారు.   ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఒక్క చిత్రం తీయడానికి ఎంతో సమయం తీసుకుంటారు. కానీ క్రిష్ మాత్రం ఈసారి జనవరికి రెండు చిత్రాలు రిలీజ్ చేసి దర్శకుడిగా తన స్టామినా ఏంటో చూపించబోతున్నట్లు సమాచారం.    క్రిష్ ఝాన్సి రాణి లక్ష్మిబాయి కథను 'మణికర్ణిక' టైటిల్ తో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.   భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్ర షూటింగ్ పూర్తయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండడటంతో పోస్ట్ ప్రొడక్షన్ కు కోసం బాగానే టైమ్ తీసుకుంటుంది. 
Image result for manikarnika movie
ఇక ఈ సినిమా జనవరి 26న రిలీజ్ చేయడానికి టైమ్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణతో ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ షరవేగంగా జరుపుతున్నారు.  ఈ సినిమా అనుకున్న టైమ్ కి పూర్తయితే..జనవరి 9 న సంక్రాంతి బరిలో దించేందుకు సన్నద్దం అవుతున్నారు క్రిష్. అయితే సంక్రాంతి పండుగ నందమూరి బాలకృష్ణకు ఎంతో సెంటిమెంట్ అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయోపిక్ పూర్తి చేసి సంక్రాంతి పండుగ గిఫ్ట్ గా ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారట క్రిష్.  ఒకవేళ  ఈ రెండు సినిమాలు మంచి హిట్ కొడితే మాత్రం క్రిష్ ని పట్టడం ఇక ఎవ్వరి తరం కాదనే అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: