మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే పెద్ద సాహసం. అలాంటిది ఇప్పుడు మరో క్రేజీ రోల్ కోసం మరోసారి రిస్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ గా మొదటి సినిమా ఒక మనసు చేసిన నిహారిక ఆ సినిమా ఆశించినంత సక్సెస్ అందుకోకపోయే సరికి అమ్మడు కాస్త గ్యాప్ తీసుకుంది.


ఇక రెండో ప్రయత్నంగా హ్యాపీ వెడ్డింగ్ సినిమా చేసింది నిహారిక. తను చేసిన ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ దర్శకుడు లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో నిహారికతో కలిసి నటించాడు.


ఈ సినిమా తర్వాత నిహారిక మళ్లీ ఓ క్రేజీ రోల్ లో కనిపిస్తుందట. ముద్దపప్పు ఆవకాయ్ తర్వాత నన్న కూచి అనే వెబ్ సీరీస్ చేసింది నిహారిక, ప్రవీణ్ డైరక్షన్ లో వచ్చిన ఆ వెబ్ సీరీస్ కూడా మంచి హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు ప్రవీణ్ డైరక్షన్ లో మరో వెబ్ సీరీస్ చేస్తుందట. 


ఆ వెబ్ సీరీస్ టైటిల్ సూర్యకాంతం అని పెట్టారట. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో గయ్యాలి అత్తగా సూర్యకాంతం చాలా ఫేమస్. మరి అలాంటి టైటిల్ తో నిహారిక ఎలా భయపెడుతుందో అని ఆడియెన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. వెబ్ సీరీస్ లపై మెగా డాటర్ మరింత క్రేజ్ సంపాదిస్తుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: