అక్కినేని యువ వారసుడు అఖిల్ హీరోగా ఇంకా సరైన హిట్ కొట్టలేదు. మొదటి రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చినా ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అవలేదు. ప్రస్తుతం అఖిల్ తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని టాక్.


అఖిల్ ను నేషనల్ స్టార్ చేయడమే నాగార్జున లక్ష్యం. అక్కినేని వారసత్వాన్ని మోసే అసలు సిసలు హీరో అఖిల్ అని నమ్ముతున్నాడు నాగార్జున అందుకే అఖిల్ కెరియర్ మీద నాగార్జున దృష్టి ఉంది. ప్రస్తుతం ఫ్లాపులు పలుకరిస్తున్నా కెరియర్ ట్రాక్ ఎక్కే సినిమా ఒకటి పడినా చాలని చూస్తున్నాడు నాగార్జున.


ఇక పనిలో పనిగా బాలీవుడ్ ఆడియెన్స్ కు ఇప్పటి నుండే అఖిల్ ను పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కాగానే కరణ్ జోహార్ నిర్మాణంలో అఖిల్ తో ఓ క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారట. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా ఉండేలా చూస్తున్నారట. సినిమా నిర్మాణంలో నాగార్జున కూడా భాగస్వామ్యం అవుతాడని తెలుస్తుంది.


అలా అఖిల్ తో బాలీవుడ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. కరణ్ జోహార్ కూడా ఈ ప్రపోజల్స్ కు సరే అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్ బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నాడు. ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో అఖిల్ బాలీవుడ్ డెబ్యూపై కాన్సెంట్రేట్ చేస్తున్నాడు నాగార్జున. అఖిల్ కెరియర్ సెట్ రైట్ అయ్యేదాకా నాగ్ నిద్ర పోయేట్టు కనిపించడం లేదు.!



మరింత సమాచారం తెలుసుకోండి: