బుల్లితెర ఇంటర్వ్యూలకు మల్టీ నేషనల్ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను మార్చడంలో బుల్లితెర పోషిస్తున్న కీలక పాత్రను చాల ఆలస్యంగా గుర్తించినట్లు కనిపిస్తోంది. గతంలో ఒక ప్రముఖ ఛానల్ అమీర్ ఖాన్ నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ లాంటి ఒక సామాజిక ప్రయోజనం ఉన్న కార్యక్రమాన్ని మన తెలుగులో పవన్ చేత హోస్ట్ చేయించాలని చాల ప్రయత్నాలు చేసింది.
JSP president Pawan Kalyan addressing a public meeting in Gajapathinagaram on Friday.
ఆ ప్రయత్నాలకు అప్పట్లో పవన్ స్పందించ లేదు. ప్రస్తుతం ‘జనసేన’ కోసం జనం మధ్య తిరుగుతున్న పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ సిద్ధాంతాలను త్వరగా జనంలోకి తీసుకువెళ్ళడానికి ఒక సామాజిక ప్రయోజనం ఉన్న ఒక షోను హోస్ట్ చేయబోతున్నట్లు తెలుగుస్తోంది. ఇప్పటికే పవన్ సన్నిహితులు 99టీవి యాజమాన్య హక్కులను పొందిన నేపధ్యంలో ఈ సామాజిక కార్యక్రమం ఆ టీవీలో త్వరలో ప్రసారం కాబోతోంది అని అంటున్నారు. 
పవన్ పోరాట యాత్రలో క్లిక్కూ.. కిక్కూ
పవన్ సన్నిహితులు పేరుకు 99టీవి 10టీవీల యాజమాన్యాన్ని కొత్తగా తీసుకున్నా ప్రస్తుతం న్యూస్ ఛానల్స్ మధ్య జరుగుతున్న విపరీతమైన పోటీలో పవన్ సన్నిహితులు తీసుకున్న ఈ రెండు న్యూస్ ఛానల్స్ రేటింగ్ పరంగా చాల వెనకపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈ రెండు న్యూస్ ఛానల్స్ కు క్రేజ్ ను ఏర్పరిచి రేటింగ్స్ పెంచడానికి పవన్ ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నాడు అనుకోవాలి.
First Break for Pawan Kalyans porata yatra
ఇది ఇలా ఉండగా పవన్ నిన్న మీడియా వర్గాలతో మాట్లాడుతూ కొందరు వ్యతిరేకులు తనకు రాజకీయాలలో అనుభవం లేదు అని చేస్తున్న కామెంట్స్ కు ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అనుభవం అన్న పదం వెనుక చాల తత్వం ఉంది అని చెపుతూ ఎవరైనా పుట్టుకతోనే అనుభవాన్ని సంపాదించుకుని పుడతారా అంటూ పదవి వస్తేనే అనుభవం వస్తుంది అంటూ కొత్త లాజిక్ లు చెపుతున్నాడు. అయితే పవన్ బుల్లితెర ఎంట్రీ గురించి వస్తున్న వార్తలను చూసి పవర్ స్టార్ బాలీవుడ్ ఆమీర్ ఖాన్ లా మారిపోవాలని అభిమానుల కోరిక..      


మరింత సమాచారం తెలుసుకోండి: