వచ్చేనెలలో ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్న ‘శ్రీనివాసకళ్యాణం’ ‘గీతగోవిందం’ సినిమాల వార్ ఇప్పుడు నితిన్ విజయ్ దేవర కొండల ఇమేజ్ వార్ గా మారింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు  హీరోలు ఒకరి పై ఒకరు పోటీ పడుతున్న నేపధ్యంలో తెలంగాణ స్టార్ ఎవరూ అన్న విషయం వచ్చేనెల ఆగష్టులో తేలనుంది. 
Srinivasa Kalyanam Movie teaser Relese
మొన్న ఆదివారం విడుదలైన నితిన్ ‘శ్రీనివాసకల్యాణం’ టీజర్ బాగుండటంతో మంచి వ్యూస్ సాధిస్తూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ ఆనందం నితిన్ కు ఒక్కరోజు కూడ మిగలలేదు. నిన్న ఉదయం విడుదలైన విజయ్ దేవర కొండ ‘గీతగోవిందం’ టీజర్ సునామీ ముందు నితిన్ ‘శ్రీనివాసకళ్యాణం’ లైక్స్ విషయంలో చాల వెనుక పడిపోయింది. 
geetha govindam first single inkem inkem inkem kaavaale released
తెలుస్తున్న సమాచారం మేరకు ‘గీతగోవిందం’ టీజర్ విడుదలై 18గంటలు పూర్తి కాకుండానే 2.8 మిలియన్ వ్యూస్ రాబట్టుకుని ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ గా మారడం సంచలనంగా మారింది. ‘గీతగోవిందం’ టీజర్ యూత్ కు బాగా నచ్చడంతో పాటు విజయ్ దేవరకొండ పాపులారిటీకి ఈ విషయం నిదర్శనం అంటూ అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి. 
Geetha Govindam teaser Vijay Deverakonda-Rashmika Mandanna
దీనితో ఇప్పటికే ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘శ్రీనివాసకల్యాణం’ ‘గీతగోవిందం’ ల వార్ లో ఎవరు విజేత అన్న విషయం పై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు మూవీల టీజర్ వార్ కు సంబంధించి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నితిన్ పై విజయ్ దేవర కొండ పై చేయి సాధించడంతో తెలంగాణ సూపర్ స్టార్ గా విజయ్ దేవరకొండ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడా అన్న అనుమానాలు కలగడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: